Solar Storm : భూమిని ఢీకొట్టిన పవర్‌ఫుల్ సౌర తుఫాను.. ఏమైందంటే ?
Solar Storm : శక్తివంతమైన సౌర తుఫాను భూమిని తాకింది. శుక్రవారం ఉదయం 4 గంటలకు ఈ ఘట్టం చోటుచేసుకుంది.
- By Pasha Published Date - 08:40 AM, Sat - 11 May 24

Solar Storm : శక్తివంతమైన సౌర తుఫాను భూమిని తాకింది. శుక్రవారం ఉదయం 4 గంటలకు ఈ ఘట్టం చోటుచేసుకుంది. ఈ సౌర తుఫానును తొలుత తీవ్రమైంది కాదని భావించారు. అయితే తర్వాత అది అత్యంత శక్తివంతమైనదని వెల్లడైంది. ఈవిధంగా సౌర తుఫాను భూమిని తాకడం రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ ఇదే తొలిసారి. ఈ ఖగోళ అద్భుతాన్ని ఆస్ట్రేలియాలోని టాస్మానియా నుంచి బ్రిటన్ వరకు ప్రజలు కనులారా చూశారు. సౌర తుఫాను(Solar Storm) భూమిని ఢీకొట్టిన తర్వాత ఆకాశంలో విరజిమ్మిన వెలుగులకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను పలువురు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని సౌర తుఫానులు భూమిని ఢీకొంటాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join
అయితే ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే.. ఈ సౌర తుఫాను తీవ్రత కంటిన్యూ అయితే శాటిలైట్లు, పవర్ గ్రిడ్‌లపై ప్రతికూల ప్రభావం పడుతుంది. వాటి పనితీరు దెబ్బతింటుంది. సౌర తుఫాను ప్రభావంతో భూ అయస్కాంత క్షేత్రంలో తీవ్ర మార్పులు జరుగుతాయి. దీనిలో సంభవించే ఆకస్మిక హెచ్చుతగ్గుల వల్ల కమ్యూనికేషన్ వ్యవస్థలు ధ్వంసమయ్యే రిస్క్ ఉంటుంది. అందుకే దీనిపై ఇప్పటికే ఉపగ్రహ ఆపరేటర్లు, విమానయాన సంస్థలు, పవర్ గ్రిడ్‌లను అప్రమత్తం చేశారు. భూ అయస్కాంత క్షేత్రాల్లో హెచ్చతగ్గుల కారణంగా విద్యుత్ వ్యవస్థలు కూలిపోయే ముప్పు ఉంటుంది. ప్రత్యేకించి అంతరిక్షంలోని స్పేస్‌క్రాఫ్టులు అధిక రేడియేషన్ బారినపడే అవకాశం ఉంది. ఈ సౌర తుఫానుకు సంబంధించిన రేడియేషన్ భూమి దాకా చేరకుండా వాతావరణంలోని పొరలు నిరోధిస్తాయి. సౌర తుఫానుల ప్రభావం ప్రధానంగా ఆస్ట్రేలియా, జపాన్, చైనాలపై ఉంటుందని నిపుణులు అంటున్నారు.
Also Read :Telangana Ministers : తెలంగాణ మంత్రులకు ‘లోక్‌సభ’ పరీక్ష.. ఎందుకంటే ?
- ప్రపంచ చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన సౌర తుఫాను 1859లో సంభవించింది. దీనికి బ్రిటిష్ ఆస్ట్రానమర్ రిచర్డ్ కారింగ్టన్ పేరును పెట్టారు. అప్పట్లో ఈ తుఫాను టెలికాం వ్యవస్థను ధ్వంసం చేసింది.
- సౌర తుఫాను వల్ల 2003 అక్టోబరులో స్వీడన్, దక్షిణాఫ్రికాలో కమ్యూనికేషన్ వ్యవస్థలు, విద్యుత్ మౌలిక సౌకర్యాలు అస్తవ్యస్తమయ్యాయి. దీన్ని అప్పట్లో ‘హాలోవీన్ సౌర తుఫాను’గా పిలిచారు.