HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Trending
  • >Pm Modis Convoy Gives Way To Ambulance In Gujarat

PM Modi’s Convoy: అంబులెన్స్‌కు దారి ఇచ్చేందుకు.. తన కాన్వాయ్ ఆపేసిన మోడీ!!

ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు.

  • By Hashtag U Published Date - 11:32 PM, Fri - 30 September 22
  • daily-hunt
Pm Modi Imresizer
Pm Modi Imresizer

ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. దేశ ప్రజలకు ఆదర్శంగా నిలిచారు.
అంబులెన్స్‌కు దారి ఇవ్వడం కోసం ఏకంగా తన కాన్వాయ్‌ నే కొద్దిసేపు ఆపేశారు. ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్‌లోని అహ్మదాబాద్ నుంచి గాంధీనగర్‌కు మోదీ వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోను గుజరాత్ బీజేపీ మీడియా విభాగం ట్విట్టర్‌లో షేర్ చేసింది. అహ్మదాబాద్-గాంధీనగర్ మార్గంలో ప్రధాని కాన్వాయ్‌లోని ఎస్‌యూవీలు నెమ్మదిగా ఎడమవైపునకు వెళ్లి అంబులెన్స్‌కు దారి ఇస్తున్నట్టు వీడియోలో కనిపిస్తోంది. ప్రధాని మోదీ గురువారం నుంచి గుజరాత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. శుక్రవారం మధ్యాహ్నం అహ్మదాబాద్‌లోని దూరదర్శన్ కేంద్రం వద్ద నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని పాల్గొని గాంధీ నగర్‌లో రాజ్‌భవన్‌కు తిరిగి వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.

સાચા પ્રધાનસેવક…

એમ્બ્યુલન્સ માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીએ પોતાનો કાફલો રોક્યો. pic.twitter.com/DI6saL3az3

— BJP Gujarat (@BJP4Gujarat) September 30, 2022

శుక్రవారం ప్రధాని గుజరాత్‌లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అహ్మదాబాద్ మెట్రో ప్రాజెక్ట్ తొలి దశతో పాటు గాంధీనగర్-ముంబయి మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు పచ్చజెండా ఊపారు. గాంధీనగర్- ముంబయి మధ్య వందే భారత్ హైస్పీడ్ రైలు ప్రారంభించిన అనంతరం కాసేపు అందులో ప్రధాని ప్రయాణించారు.
ఈ రోజు సాయంత్రం బనస్కాంత జిల్లాలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. అక్కడి ప్రముఖ అంబాజీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

త్వరలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు

త్వరలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో పలు ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన బీజేపీ సర్కారు పూర్తిచేసి ప్రారంభోత్సవాలు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమాల కోసం ప్రధాని నరేంద్రమోదీ తన సొంత రాష్ట్రం గుజరాత్‌లో తరుచూ పర్యటిస్తున్నారు.

వందే భారత్ హైస్పీడ్ రైలు ప్రత్యేకతలు..

గాంధీనగర్-ముంబయి మధ్య వందే భారత్ హైస్పీడ్ రైలు నడుస్తుంది. ఇది అక్టోబరు 1 నుంచి అందుబాటులోకి రానుంది. ఆదివారం మినహా వారంలో ఆరు రోజులు నడవనుంది. ఈ మార్గంలో టికెట్ కనిష్ఠ ధర రూ.1385, గరిష్ఠ ధర రూ. 2505గా ఉంది. కాగా.. దేశంలో ఇది మూడో వందే భారత్‌ రైలు. 2019లో తొలి వందే భారత్‌ రైలు దేశంలో అందుబాటులోకి వచ్చింది. న్యూడిల్లీ – వారణాసి మార్గంలో హైస్పీడ్ రైలు ప్రారంభించగా.. న్యూఢిల్లీ – శ్రీ మాతా వైష్ణోదేవి మార్గంలో రెండో రైలును ప్రవేశపెట్టారు.

Travelled on board the Vande Bharat Express! It was a delight to meet women start-up entrepreneurs, talented youth, those associated with the Railways team and those involved in building the Vande Bharat train. It was a memorable journey. pic.twitter.com/eHKAhMlRCc

— Narendra Modi (@narendramodi) September 30, 2022


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ambulance
  • PM Convoy
  • pm modi
  • Vande Bharat Express

Related News

PM Modi

PM Modi: మ‌రో దేశ అధ్యక్షుడితో ప్ర‌ధాని మోదీ చ‌ర్చ‌లు.. ఎందుకంటే?

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కూడా శనివారం (సెప్టెంబర్ 6) పీఎం మోదీతో మాట్లాడిన తర్వాత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో ఒక పోస్ట్ షేర్ చేశారు.

  • Tensions in India-US relations: Modi absent from UN meetings!

    PM Modi : భారత్‌–అమెరికా సంబంధాల్లో ఉద్రిక్తతలు : ఐరాస సమావేశాలకు మోడీ గైర్హాజరు!

  • Minister Lokesh meets Prime Minister Modi..these are the topics discussed..!

    Lokesh Delhi Tour : ప్రధాని మోడీతో మంత్రి లోకేష్ భేటీ..చర్చించిన అంశాలివే..!

  • New GST

    New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

  • Small chip made in India has the power to change the world: PM Modi

    PM Modi : భారత్ తయారు చేసిన చిన్న చిప్ ప్రపంచాన్ని మార్చే శక్తి కలిగి ఉంది: ప్రధాని మోడీ

Latest News

  • Congress : ప్రభుత్వం మారితేనే న్యాయం జరుగుతుందేమో..? – రాజగోపాల్ కీలక వ్యాఖ్యలు

  • Kutami Super 6 : అనంతపురంలో ఈ నెల 10న సూపర్ సిక్స్-సూపర్ హిట్ సభ

  • Nara Lokesh : శ్రీ ఆదిచుంచనగిరి మఠాన్ని సందర్శించిన మంత్రి నారా లోకేశ్

  • TTD: రేపు ఎన్నిగంట్లకు టీటీడీలో దర్శనమంటే.?

  • Venezuela : కరేబియన్‌లో ఉద్రిక్త వాతావరణం: వెనుజువెలా ఆక్రమణకు అమెరికా సిద్ధం..!

Trending News

    • GST Rates: జీఎస్టీ మార్పులు.. భారీగా త‌గ్గ‌నున్న ధ‌ర‌లు!

    • GST Reforms Impact: హోట‌ల్స్ రూమ్స్‌లో ఉండేవారికి గుడ్ న్యూస్‌!

    • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd