Piplantri Plants 111 Trees : ఆ ఊర్లో ఆడపిల్ల పుడితే..వెంటనే చేసే పని అదే..!!
Plant 111 Trees : ఆడపిల్ల పుట్టగానే 111 మొక్కలు నాటుతారు. ఈ ఆచారం ఎక్కడా అని అనుకుంటున్నారా..? రాజస్థాన్లోని రాజసమంద్ జిల్లా పిప్లాంత్రి గ్రామంలో
- By Sudheer Published Date - 02:40 PM, Fri - 3 January 25

పదేళ్ల క్రితం వరకు ఆడపిల్ల పుడితే అయ్యో అనుకొనే వారు..కొంతమందైతే అనాధ ఆశ్రమంలో వదిలేయడం లేదా పిల్లలు లేని తల్లిదండ్రులకు ఇచ్చేయడం చేసేవారు. కానీ ఇప్పుడు ఆడపిల్ల పుడితే పెద్ద పండగల భావిస్తున్నారు. అంతే కాదు ఊరందర్నీ పిలిచి భోజనాలు పెట్టి సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఈ ఊర్లో మాత్రం ఆడపిల్ల పుడితే ఓ వింత ఆచారం చేస్తారు. ఆడపిల్ల పుట్టగానే (Girl child is born) 111 మొక్కలు (Plant 111 trees) నాటుతారు. ఈ ఆచారం ఎక్కడా అని అనుకుంటున్నారా..? రాజస్థాన్లోని రాజసమంద్ జిల్లా పిప్లాంత్రి (Piplantri ) గ్రామంలో.
Bhatti Vikramarka : ఐఐటీ హైదరాబాద్ ఆవిష్కరణల కర్మాగారం
ఆడపిల్ల పుడితే ఆనందంగా జరుపుకోవడం రాజస్థాన్ రాష్ట్రంలోని రాజసమంద్ జిల్లాలోని పిప్లాంత్రి గ్రామంలో ఒక ప్రత్యేక ఆచారంగా ఉంది. ఈ గ్రామంలో ఆడపిల్ల పుట్టగానే 111 మొక్కలు నాటడం పరిపాటిగా కొనసాగుతోంది. ఈ ఆచారం గ్రామస్థుల సహకారంతో సహజసిద్ధమైన పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతోంది. మొక్కలు నాటడమే కాకుండా ఆడపిల్ల భవిష్యత్తు కోసం ఆర్థికంగా తోడ్పాటు అందించడం ఈ గ్రామంలో మరో విశేషం. గ్రామస్తులంతా కలసి రూ.21 వేలు, తల్లిదండ్రులు రూ.10 వేలను ఫిక్స్డ్ డిపాజిట్‌గా చేసి ఆడపిల్ల భవిష్యత్తు స్థిరతకు భరోసా కల్పిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఆడపిల్లలకు మరింత గౌరవం మరియు భద్రత లభిస్తున్నాయి.
Maruti Suzuki : ఎస్‌యూవీల యుగంలో ఆల్టో దుమ్ము రేపింది..!
ఈ ఆచారాన్ని 2006లో అప్పటి గ్రామ సర్పంచ్ శ్యామ్ సుందర్ ప్రవేశపెట్టారు. ఆడపిల్లలపై ఉన్న ప్రతికూల అభిప్రాయాలను మార్చేందుకు ఆయన ఈ వినూత్న ఆలోచన చేసారు. ఇది దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందేలా చేసింది. ఈ ప్రయత్నం మహిళల ప్రాధాన్యతను సమాజానికి తెలియజేసే పథకంగా నిలిచింది. నాటిన మొక్కలను గ్రామస్తులే సంరక్షిస్తుంటారు. పిప్లాంత్రి గ్రామానికి చెందిన ఈ ఆచారం దేశంలోని పలు ప్రాంతాల్లో ఆదర్శంగా మారింది. ఇది నేడు ఆడపిల్లలపై ఉన్న అభిప్రాయాలను మార్చడంలో ముఖ్యపాత్ర పోషిస్తోంది.