Inspiring Story: వికలాంగులకు ఇన్‌స్పిరేషనల్‌గా నిలిచిన పార్వతి గోపకుమార్
Inspiring Story: 12 ఏళ్ల వయసులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె కుడి చేయి కోల్పోయినా, జీవితంపై ఆశను కోల్పోకుండా UPSC సివిల్ సర్వీసెస్‌లో 282వ ర్యాంక్ సాధించడం నిజంగా గొప్ప విషయం.
- By Sudheer Published Date - 05:57 PM, Sat - 24 May 25

జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు మన శక్తిని పరీక్షిస్తాయి. అలాంటి సమయంలో నిలదొక్కుకుని ముందుకు సాగటం గొప్ప విషయం. కేరళకు చెందిన పార్వతి గోపకుమార్ (Parvati Gopakumar) అనే యువతి కూడా ఓ ఉదాహరణ గా నిలిచింది. 12 ఏళ్ల వయసులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె కుడి చేయి కోల్పోయినా, జీవితంపై ఆశను కోల్పోకుండా UPSC సివిల్ సర్వీసెస్‌లో 282వ ర్యాంక్ సాధించడం నిజంగా గొప్ప విషయం. ఆమె 2025 మే 19న ఎర్నాకుళం అసిస్టెంట్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించి తన కలను సాకారం చేసుకుంది. ఇది ఆమె ధైర్యానికి, కృషికి, కుటుంబం మద్దతుకు ప్రతీకగా నిలిచింది.
Marriott International : ప్రపంచవ్యాప్తంగా తన లాడ్జింగ్ ఆఫర్‌లను విస్తరిస్తున్న మారియట్ ఇంటర్నేషనల్
పార్వతి జీవితం చిన్నతనంలోనే ఓ మలుపు తీసుకుంది. ఏడవ తరగతిలో చదువుతున్నపుడే ఆమె బైక్ యాక్సిడెంట్‌కి గురై కుడి చేయి కోల్పోయింది. అయితే ఆమె వెనక్కి తగ్గలేదు. LKG స్థాయి కర్సివ్ రైటింగ్ పుస్తకాల సహాయంతో ఎడమ చేతితో రాయడం నేర్చుకుంది. ఆమె బెంగళూరులోని నేషనల్ లా స్కూల్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేయడం ద్వారా విద్యపై తన పట్టుదలను చూపించింది. ఆమెకు తండ్రి రెవెన్యూ శాఖలో డిప్యూటీ తహసీల్దార్, తల్లి స్కూల్ టీచర్. వారి ప్రోత్సాహం ఆమెను UPSC లక్ష్యానికి తీసుకువచ్చింది. మొదటి ప్రయత్నంలో విఫలమైనా, రెండో ప్రయత్నంలోనే విజయం సాధించింది.
Juno Joule Green Energy : సెలెక్ట్ ఎనర్జీ GmbHతో జునో జౌల్ గ్రీన్ ఎనర్జీ వ్యూహాత్మక అవగాహన ఒప్పందం
పార్వతి విజయం వెనుక VR కృష్ణ తేజ అనే సబ్-కలెక్టర్ ప్రేరణ ఒక ముఖ్య పాత్ర పోషించింది. అతని మాటలు ఆమెలో సివిల్ సర్వీసెస్‌పై ఆసక్తిని రేకెత్తించాయి. ఎడమ చేతితో సంతకం చేసి, కలెక్టర్ కార్యాలయంలో చేరిన ఆమె “నా కల నెరవేరింది” అంటూ తెలిపి తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది పరీక్ష రాసిన UPSC 2023లో తను టాప్ 300 ర్యాంకర్లలో చోటు దక్కించుకోవడం గర్వకారణం. ఆమె కథ దేశ యువతకు, ముఖ్యంగా వికలాంగులకు ఒక వెలుగుజ్యోతి. పార్వతి గోపకుమార్ జీవిత ప్రయాణం అసాధ్యాన్ని సాధ్యంగా మార్చగలమనే నమ్మకానికి మారుపేరుగా నిలిచింది.