HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Nia Custody Of Tahawwur Rana Extended

Tahawwur Rana : తహవ్వుర్ రాణా ఎన్‌ఐఏ కస్టడీ పొడిగింపు

ఈ విచారణకు అతడు సహకరించకుండా.. తప్పించుకునే రీతిలో సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది. ముంబయి ఉగ్రదాడులతో తనకు ఎలాంటి సంబంధం లేదని విచారణలో భాగంగా రాణా వెల్లడించినట్లు తెలుస్తోంది.

  • Author : Latha Suma Date : 28-04-2025 - 6:23 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Tahawwur Rana
Tahawwur Rana

Tahawwur Rana : 26/11 ముంబై దాడులకేసులో ప్రధాన సూత్రధారి తహవ్వుర్‌ హుస్సేన్‌ రాణా ఎన్‌ఐఏ కస్టడీని సోమవారం ఢిల్లీ కోర్టు పొడిగించింది. దీంతో అతడు మరో 12 రోజులు దర్యాప్తు సంస్థ కస్టడీలో ఉండనున్నాడు. ఎన్‌ఐఏ అదుపులో ఉన్న రాణాను ఇటీవల ముంబయి క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు విచారించారు. ఈ విచారణకు అతడు సహకరించకుండా.. తప్పించుకునే రీతిలో సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది. ముంబయి ఉగ్రదాడులతో తనకు ఎలాంటి సంబంధం లేదని విచారణలో భాగంగా రాణా వెల్లడించినట్లు తెలుస్తోంది.

ఇక, ఇదివరకు విధించిన 18 రోజుల కస్టడీ గడువు ముగియడంతో ఈ రోజు రాణాను కోర్టుముందు హాజరుపర్చారు. అతడి ముఖం కనిపించకుండా కవర్ చేసి, కట్టుదిట్టమైన భద్రత నడుమ న్యాయస్థానానికి తీసుకువచ్చారు. తహవ్వుర్‌ రాణా పాకిస్థాన్‌కు చెందిన కెనడా జాతీయుడు. 26/11 ముంబయి దాడుల్లో కీలక సూత్రధారి. ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నాడన్న ఆరోపణలపై 2009లో అరెస్టయ్యాడు. అమెరికా జైల్లో శిక్ష అనుభవించిన అతడిని అప్పగింత ప్రక్రియలో భాగంగా భారత్‌కు తీసుకువచ్చిన విషయం తెలిసిందే.

కాగా, 10 మంది పాకిస్థానీ ఉగ్రవాదులు 2008 నవంబర్ 26న సముద్ర మార్గం ద్వారా ముంబయికి చేరుకుని.. సీఎస్‌ఎంటీ, ఒబెరాయ్ ట్రైడెంట్, తాజ్ హోటల్‌ తదితర ప్రాంతాల్లో దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనల్లో 18 మంది భద్రత సిబ్బంది సహా 166 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు. అప్పటి యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) చీఫ్ హేమంత్ కర్కరే, ఆర్మీ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్, ముంబయి అదనపు పోలీస్ కమిషనర్ అశోక్ కామ్టే, సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ విజయ్ సలాస్కర్‌లు అమరులయ్యారు. ఈ దాడులు నవంబర్ 29 వరకు కొనసాగింది.

తహవ్వూర్ రాణాను భారతదేశానికి తరలించేందుకు అమెరికా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అమెరికా సుప్రీం కోర్టు 2023లో ఆయనను భారతదేశానికి అప్పగించేందుకు అనుమతిచ్చింది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నిర్ణయాన్ని ఆమోదించారు. తహవ్వూర్ రాణా ఎన్ఐఏ కస్టడీలోకి అప్పగించబడటం, 26/11 ముంబై ఉగ్రదాడుల కేసులో న్యాయవ్యవస్థకు కీలక మలుపు. రాణా నుంచి పొందే సమాచారం, ఉగ్రవాద నెట్‌వర్క్‌ను అరికట్టడంలో సహాయపడే అవకాశం ఉంది.

Read Also : Terrorists Hunt : నలుగురు ఉగ్రవాదుల వేట.. లొకేషన్‌‌‌పై కీలక అప్‌డేట్

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • delhi court
  • extended
  • Mumbai Crime Branch Police
  • NIA custody
  • Tahawwur Rana

Related News

Jacqueline Fernandez Appeal For Become Approver Against Sukesh Chandrashekhar

Jacqueline Fernandez : అప్రూవర్‌గా మారతానన్న నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్

ఆర్థిక మోసగాడు సుకేశ్ చంద్రశేఖర్‌కు సంబంధించిన రూ.215 కోట్ల మనీలాండరింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో తాను అప్రూవర్‌గా మారేందుకు సిద్ధంగా ఉన్నానని బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇటీవల ఢిల్లీ కోర్టుకు తెలిపారు. దీంతో ఈ కేసు ఊహించని మలుపు తీసుకుంది. జాక్వెలిన్ అభ్యర్థనపై స్పందించిన న్యాయస్థానం, ఈ విషయంలో ముందుగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి

    Latest News

    • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

    • కియా కారు.. రూ. 3.20 ల‌క్ష‌ల వ‌ర‌కు డిస్కౌంట్‌!

    • నిద్ర‌లేమి స‌మ‌స్య‌.. క‌ళ్ల‌పై ప్ర‌భావం?

    • నేడు గుజరాత్ vs ముంబై మ్యాచ్‌.. గెలుపెవ‌రిది?

    • Stone-Grinding Process : పిండి రుబ్బే సరికొత్త పరికరాన్ని తీసుకొచ్చిన సాఫ్టెల్ సంస్థ

    Trending News

      • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

      • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

      • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

      • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

      • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd