HashtagU Telugu
HashtagU Telugu Telugu HashtagU Telugu
  • English
  • हिंदी
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
News
CloseIcon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # World Cup
  • # Nara Lokesh
  • # Nara Chandrababu Naidu
  • # KCR

  • Telugu News
  • ⁄Trending
  • ⁄Nasa Spacecraft To Crash Into Asteroid As Big As Football Stadium Heres How To Watch

NASA Spacecraft TO Crash: ఆస్టరాయిడ్ తో నాసా స్పేస్ క్రాఫ్ట్ ఢీ.. రేపు వేకువజామున సంచలన ప్రయోగం!!

ఆస్టరాయిడ్స్ వేగంగా దూసుకొచ్చి భూమిని ఢీకొంటే ఎలా ? ఎటువంటి ఉత్పాతం జరుగుతుంది ?

  • By Hashtag U Published Date - 08:35 AM, Tue - 27 September 22
  • daily-hunt
NASA Spacecraft TO Crash: ఆస్టరాయిడ్ తో నాసా స్పేస్ క్రాఫ్ట్ ఢీ.. రేపు వేకువజామున సంచలన ప్రయోగం!!

ఆస్టరాయిడ్స్ వేగంగా దూసుకొచ్చి భూమిని ఢీకొంటే ఎలా ? ఎటువంటి ఉత్పాతం జరుగుతుంది ? ఎంత నష్టం జరుగుతుంది ? ఆస్టరాయిడ్స్ ను భూమి వైపు రాకుండా అడ్డుకోవచ్చా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు.. ఎన్నో భయాలకు సమాధానం వెతికే ప్రయత్నంలో భాగంగా నాసా మంగళవారం సరికొత్త ప్రయోగం చేయబోతోంది. దీన్ని మంగళవారం (సెప్టెంబర్ 27న) వేకువజామున 4 గంటల 44 నిమిషాలకు నాసా అఫీషియల్ యూట్యూబ్ చానల్ లో ప్రసారం చేయబోతున్నారు. ఈ ప్రయోగంలో భాగంగా నాసాకు చెందిన స్పేస్ క్రాఫ్ట్ “dart” (డబుల్ ఆస్టరాయిడ్ రీ డైరెక్షన్ టెస్ట్) గంటకు 22,500 కిలోమీటర్ల వేగంతో ” Dimorphos” అనే ఆస్టరాయిడ్ ను ఢీకొట్టనుంది. ఈ ఆస్టరాయిడ్ 160 మీటర్ల వెడల్పు ఉంటుంది. ఇది 780 మీటర్ల వెడల్పు ఉన్న “Didymos” అనే మరో పెద్ద ఆస్టరాయిడ్ చుట్టూ తిరుగుతోంది.
నాసా స్పేస్ క్రాఫ్ట్ వేగంగా ఢీకొట్టిన వెంటనే Dimorphos ఆస్టరాయిడ్ సాధారణంగా తిరిగే రూట్ మారిపోతుందని నాసా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
వెబ్ టెలిస్కోప్, హబుల్ టెలిస్కోప్..నుంచి నాసా శాస్త్రవేత్తలు ఈ ఘట్టాన్ని చూస్తూ జరుగుతున్న మార్పును.. స్పేస్ క్రాఫ్ట్ ఢీకొన్నాక ఆస్టరాయిడ్ దిశలో వచ్చే మార్పును అంచనా వేస్తారు.

గతంలో ఒక ఘటన..

2013 ఫిబ్రవరి 15న రష్యాలోదక్షిణ ఉరల్ ప్రాంతంలోకి దూసుకొచ్చిన ఉల్క విధ్వంసం సృష్టించింది. ప్రజల  హాహాకారాలతో ఆ చుట్టుపక్కల ప్రాంతాలు హోరెత్తాయి. దీని కారణంగా 33 మిలియన్ డాలర్ల నష్టం సంభవించింది. ఈ బీభత్సం సృష్టించిన ఉల్కకి ఉన్న శక్తి.. హిరోషిమాపై అమెరికా వేసిన అణుబాంబు కంటే 30 రెట్లు ఎక్కువని నాసా గుర్తించింది. ఫ్యూచర్ లో ఇంకొన్ని ఉల్కలు, ఆస్టరాయిడ్స్ ఇలా భూమిని ఢీకొనే ఛాన్స్ లేకపోలేదని అప్పట్లో వార్నింగ్ ఇచ్చింది. గ్రహశకలాలు, ఉల్కలు.. ఎప్పటికైనా భూమికి ప్రమాదకరమైనవే!! అందుకే అంతరిక్షంలో వాటిని స్పేస్‌ క్రాఫ్ట్‌ల ద్వారా ఢీకొట్టే ఆలోచనతో నాసా “dart” మిషన్ చేపట్టింది. ఆగస్టు 29న జరగాల్సిన డబుల్‌ ఆస్టరాయిడ్‌ రీడైరెక్షన్‌ టెస్ట్‌ మిషన్‌ (DART Mission) రెండో ప్రయోగం ఇంజిన్‌లోని సాంకేతిక సమస్యలతో వాయిదా వేసింది. దీనిని ఫ్లోరిడాలో కేప్ కెనర్వాల్‌లోని కెన్నడీ అంతరిక్ష కేంద్రం నుంచి సెప్టెంబర్ 27న వేకువజామున 4:44 గంటలకు నిర్వహించనున్నారు. ఈ ప్రయోగం విజయవంతం అయితే గ్రహశకలం డైమోర్ఫోస్‌ను నాసా స్పేస్ క్రాఫ్ట్ ఢీకొంటుంది.

ఆస్టరాయిడ్‌ అంటే ?

ఆస్టరాయిడ్‌లు సుమారు 4.6 బిలియన్ సంవత్సరాల కిందట సౌర వ్యవస్థ ఏర్పడగా మిగిలిపోయిన రాతి శకలాలు. గ్రహశకలం భూమికి సమీపంలో ఉన్న వస్తువుగా శాస్త్రవేత్తలు వర్గీకరించారు. మనం నివసించే భూగోళం నుంచి దాని దూరం 93 మిలియన్ మైళ్లు. ఇది భూమికి, సూర్యుడికి మధ్య దూరం కంటే 1.3 రెట్లు తక్కువ.

Tags  

  • asteroid
  • football stadium
  • nasa
  • NASA spacecraft
https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/drreddys.jpg

Related News

Solar Storm: దూసుకువ‌స్తున్న సౌర తుఫాను.. నేడు భూమిని తాకే అవ‌కాశం, ఇంటర్నెట్ సేవలకు ఇబ్బంది..!?

Solar Storm: దూసుకువ‌స్తున్న సౌర తుఫాను.. నేడు భూమిని తాకే అవ‌కాశం, ఇంటర్నెట్ సేవలకు ఇబ్బంది..!?

ఈరోజు భూమిపై పెను ప్రమాదం పొంచి ఉంది. దీనిపై నాసా, వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేశాయి. దీని ప్రకారం ఈ రోజు అంటే నవంబర్ 30న సౌర తుఫాను (Solar Storm) భూమిని తాకవచ్చు.

  • Snake Robot : చంద్రుడు, అంగారకుడిపైకి స్నేక్ రోబో.. మనోడి క్రియేటివిటీ

    Snake Robot : చంద్రుడు, అంగారకుడిపైకి స్నేక్ రోబో.. మనోడి క్రియేటివిటీ

  • Houses On The Moon : చంద్రుడిపైకి ఇళ్లు కట్టే ‘3డీ ప్రింటర్’.. ప్రయోగానికి ముహూర్తం ఖరారు

    Houses On The Moon : చంద్రుడిపైకి ఇళ్లు కట్టే ‘3డీ ప్రింటర్’.. ప్రయోగానికి ముహూర్తం ఖరారు

  • Electric Air Taxi: అందుబాటులోకి ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీలు

    Electric Air Taxi: అందుబాటులోకి ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీలు

  • Asteroid Samples : ఆస్టరాయిడ్ శాంపిల్స్ భూమికి వచ్చేశాయ్.. ఎలా ? ఎందుకు ?

    Asteroid Samples : ఆస్టరాయిడ్ శాంపిల్స్ భూమికి వచ్చేశాయ్.. ఎలా ? ఎందుకు ?

Latest News

  • Telangana BJP: కార్యకర్తల్ని నిండా ముంచిన బీజేపీ

  • KTR: ప్రతిపక్ష పార్టీ బాధ్యతలను విజయవంతంగా నిర్వహిద్దాం: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేటీఆర్

  • Weight loss: తొందరగా బరువు తగ్గాలి అంటే ఈ ఐదు రకాల జ్యూస్ లను తీసుకోవాల్సిందే?

  • Allu Aravind: కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలను కలుస్తాం: నిర్మాత అల్లు అరవింద్

  • Curry Leaves Benefits: ఖాళీ కడుపుతో కరివేపాకుని తీసుకుంటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

Trending

    • A Worker Vs MLA : రోజువారీ కూలీ ఎమ్మెల్యే అయ్యాడు.. ఏడుసార్లు గెలిచిన ఎమ్మెల్యేపై విజయం

    • Deputy CM – 94 Votes : 94 ఓట్లతో ఓడిపోయిన డిప్యూటీ సీఎం.. ఎక్కడంటే ?

    • Pawan Kalyan: జనసేనపై నెట్టింట ట్రోలింగ్.. బర్రెలక్కతో పోల్చుతూ సెటైర్లు!

    • Blue Whales Singing : సంతానోత్పత్తి టైంలో పాట పాడే తిమింగలాలు

    • Sex Vs Work : సెక్స్‌కు నో అంటే జాబ్ నుంచి తీసేస్తానంటూ ఏళ్ల తరబడి రేప్

Hashtag U

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice

Telugu News

  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat

Trending News

  • World Cup
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • kcr

follow us

  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd
Go to mobile version