Ambidextrous: వావ్.. ఈ టీచర్ ట్యాలెంట్ చూస్తే ఫిదా కావాల్సిందే.. ఎంత బాగా వేశాడో!
సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఏం జరిగినా కూడా క్షణాల్లో తెలిసిపోతోంది. కాగా నిత్యం
- By Nakshatra Published Date - 08:15 AM, Sat - 23 July 22
సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఏం జరిగినా కూడా క్షణాల్లో తెలిసిపోతోంది. కాగా నిత్యం కొన్ని వందల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. కాగా అందులో కొన్ని ఫన్నీ వీడియోలు, మరికొన్ని బాధాకరమైన వీడియోలు, మరికొన్ని ఆహ్లాదకరమైన వీడియోలు, అలాగే టాలెంట్ కు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. ఎక్కువగా టాలెంట్ కు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి. ఆ వీడియోలను చూస్తే ఎవరైనా సరే వారి టాలెంట్ కు మెచ్చుకోవాల్సిందే.
అలా చాలామంది వాటిలో ఉన్న టాలెంట్ ను బయటపెడుతూ అందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయంలో టాలెంట్ ఉంటుంది. కొందరు కొత్త కొత్త విషయాలను కనుగొంటూ ఉంటారు. ఇకపోతే అసలు విషయంలోకి వెళితే.. సాధారణంగా మనం డ్రాయింగ్ వేసేటప్పుడు ఎక్కువగా కుడి చేతిని ఉపయోగిస్తూ ఉంటాం. ఒకవేళ ఎడమ చేతి వాటం ఉంటే ఎడమ చేతిని ఉపయోగిస్తూ ఉంటారు. ఇక టాలెంట్ ఉన్నవారు అయితే రెండు చేతులను ఉపయోగించి చక్కగా బొమ్మలు గీస్తూ ఉంటారు. ఇప్పుడు మనం తెలుసుకోబోయే వ్యక్తి కూడా రెండు చేతులతో అద్భుతంగా బొమ్మను గీశాడు.
A video shared by a page Hinduism Now Global Press on Facebook, of a man drawing a picture with both hands without even looking at the board, is now going #viral.https://t.co/LFzEIxAPcn pic.twitter.com/XoegE4Mtp4
— News18 (@CNNnews18) July 21, 2022
అయితే అందులో వింత ఏముంది అని అనుకుంటున్నారా. నిజంగానే అదొక అద్భుతం అని చెప్పవచ్చు. ఒక స్కూల్లో టీచర్ వెనుక వైపు బోర్డు ఉండగా, ఆ బోర్డుని చూడకుండా ఇటువైపు తిరిగి ఆ బొమ్మను వేస్తున్నాడు. అంతేకాకుండా ఒక బొమ్మ కాకుండా రెండు బొమ్మలను అది కూడా వేరే వేరే బొమ్మలను కేవలం 46 సెకండ్లలో చక్కగా గీశాడు. అందుకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియోని చూసిన నెటిజెన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా సోషల్ మీడియాలో వరులు అవుతున్న ఆ వీడియోని తొమ్మిది లక్షల మంది పైగా వీక్షించగా, దాదాపు రెండు లక్షల మంది కామెంట్స్ పెట్టారు.
Related News
Lizard Astrology for Female: స్త్రీ శరీరంపై బల్లి ఎక్కడ పడితే ఏమవుతుంది?
బల్లి అనగానే భయంతో ఆమడ దూరం వెళ్ళిపోతాం. పైగా బల్లి మనమీధపడితే ఒళ్ళు జలదరింపు మాట అటుంచితే ఎన్నెన్నో అనుమానాలు.. ఏదో అపచారం జరిగిపోతుందని భయాందోళనలు .. చివరకి కథ కంచి వరకు చేరుతుంది. అక్కడకు వెళ్లి బంగారు బల్లి ముట్టుకుని వచ్చేవరకు మనశ్శాంతి ఉందదు