Madhya Pradesh: దారుణం.. మండుటెండలో చిన్నారి మృతదేహాన్ని భుజాలపై మోసుకెళ్లిన మేనమామ?
తాజాగా మధ్యప్రదేశ్లోని,ఛతర్ పూర్ జిల్లాలో బక్స్ వాహాలో ఒక దారుణ ఘటన చోటుచేసుకుంది. తన ఏడేళ్ల కూతురు మృతదేహాన్ని భుజాలపై మోస్తు దాదాపుగా ఒక పది కిలోమీటర్ల మేర నడిచాడు ఒక తండ్రి.
- By Nakshatra Updated On - 11:41 AM, Fri - 10 June 22

తాజాగా మధ్యప్రదేశ్లోని,ఛతర్ పూర్ జిల్లాలో బక్స్ వాహాలో ఒక దారుణ ఘటన చోటుచేసుకుంది. తన ఏడేళ్ల కూతురు మృతదేహాన్ని భుజాలపై మోస్తు దాదాపుగా ఒక పది కిలోమీటర్ల మేర నడిచాడు ఒక తండ్రి. అనారోగ్యంతో లఖాన్ పూర్ గ్రామంలోని ఒక కమ్యూనిటీ హెల్త్ హాస్పిటల్ లో ఆ బాలిక ప్రాణాలు కోల్పోయింది. అయితే హాస్పిటల్ సమీపంలో అంబులెన్స్ సౌకర్యం లేకపోవడంతో ఆ బాలిక తండ్రి చేసేదేమీలేక ఆ మృతదేహాన్ని భుజాన పైన మోసుకొని దాదాపుగా పది కిలోమీటర్లు తీసుకొని ఇంటికి చేరుకున్నాడు.
దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో వైరల్ కావడంతో ఈ విషయంపై డాక్టర్ విజయ్ పథోరియా మాట్లాడుతూ అంబులెన్సులు సమస్యలపై ఎంపీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో మాట్లాడతామని తెలిపారు.
MP: छतरपुर जिले से स्वास्थ्य विभाग और जिला प्रशासन का चेहरा दिखाती एक तस्वीर सामने आई है.मामला बकस्वाहा का है जहाँ 4 साल की मासूम की मौत के बाद घर ले जाने शव वाहन नही मिला,मजबूरी में परिजन शव को कंधे पर रखकर ले जा रहे थे pic.twitter.com/k8Od90c3p8
— sunil upadhyay (@SunilKhajuraho) June 9, 2022
ఇదే విషయంపై ఆస్పత్రి సిబ్బంది ప్రశ్నించగా అంబులెన్సు త్వరలోనే వస్తుందని కానీ అంతలోనే ఆ వ్యక్తి మృతదేహాన్ని తీసుకెళ్లారని తెలిపారట. అంబులెన్స్ వచ్చేలోపే ఆ తండ్రి బాలిక మృతదేహాన్ని భుజాలపై తీసుకెళ్లాడని ఆస్పత్రి సిబ్బంది తెలిపారట. అదేవిధంగా దీనిపై చత్తీస్గడ్ ఆరోగ్య శాఖ మంత్రి టీ ఎస్ సింగ్ డియో స్పందించి ఈ విషయంపై విచారణకు ఆదేశించామని ఈ ఘటన పట్ల హెల్త్ సెంటర్ నిర్లక్ష్యం ఉందని తేలితే ఆ సెంటర్ మెడికల్ ఆఫీసర్ ను బదిలీ చేస్తామని తెలిపారు.
Related News

Viral Video : మొసలితో మేయర్ మ్యారేజ్!
చిత్ర, విచిత్ర ఘటనలకు భూ ప్రపంచాన్ని మించిన వేదిక మరొకటి లేదు. కంప్యూటర్ల యుగంలోకి అడుగు పెట్టినా.. ప్రకృతితో ఉన్న పేగు బంధాన్ని మనిషి కొనసాగిస్తున్నాడు.