Lovers Video: స్కూటీపై రెచ్చిపోయిన లవర్స్.. షాకిచ్చిన పోలీసులు!
స్కూటీ వెళుతున్న ఓ ప్రేమ జంట (Lovers) సినిమాలో మాదిరిగా రొమాన్స్ చేశారు.
- Author : Balu J
Date : 18-01-2023 - 3:13 IST
Published By : Hashtagu Telugu Desk
సినిమాల (Cinema) ప్రభావమో.. ఏదైనా కొత్తగా చేయాలనే ప్రయత్నమో.. కానీ ఈతరం ప్రేమజంటలు (Lovers) హద్దుమీరి ప్రవర్తిస్తున్నాయి. పబ్లిక్ ప్లేస్ లోనూ ముద్దులాడుకుంటూ రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నాయి. తాజాగా లక్నోలోని రద్దీగా ఉండే ప్రాంతం హజ్రత్‌గంజ్ లో ఓ ప్రేమ జంట (Lovers) సినిమాలో మాదిరిగా రన్నింగ్ స్కూటీపై రొమాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
స్కూటీపై ఇద్దరు (ప్రేమజంట) హెల్మెట్ లేకుండా బిజీగా ఉన్న రహదారిపై స్కూటీపై ప్రయాణించారు. అయితే తన ప్రేయసిని ఎదురుగా కూర్చొబెట్టి అదేపనిగా కిస్ చేస్తున్నాడు. ఈ జంట (Lovers) ముద్దులు పెట్టుకోవడం, ఆలింగనం చేసుకోవడం ఈ వీడియోలో చూడొచ్చు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో (Social media) వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ప్రేమ జంటను అదుపులోకి తీసుకొని పోలీసులు (Police) ఎంక్వైరీ మొదలుపెట్టారు.
Also Read: Amala Paul: అమలా పాల్ కు అవమానం.. కేరళ గుడిలోకి నో ఎంట్రీ!