HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Ktr Meeting With Brs Party Workers Of Karimnagar Parliamentary Constituency

KTR : ఎవరు గాడిదో… ఎవరు గుర్రమో… ప్రజలకు తెలియాలిః కేటీఆర్

  • By Latha Suma Published Date - 03:42 PM, Thu - 7 March 24
  • daily-hunt
Ktr Meeting With Brs Party
Ktr Meeting With Brs Party

 

 

KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(ktr) నేడు కరీంనగర్(Karimnagar)పార్లమెంట్ నియోజకవర్గ  పార్టీ కార్యకర్తలతో(Party workers) సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ఎవరు గాడిదో… ఎవరు గుర్రమో… ప్రజలకు కూడా తెలియాలి… అందుకే రేవంత్ రెడ్డి(Revanth Reddy) అయిదేళ్లు పాలన చేయాలి… అప్పుడు రేవంత్ రెడ్డి పాలన చూశాక కేసీఆర్(kcr) గొప్పతనం తెలుస్తుందని అన్నారు. నాడు ఆంధ్రా పాలన మీద 2001లో కేసీఆర్ కరీంనగర్‌లో సింహగర్జన పెట్టారని… ఇప్పుడు అబద్దాల రేవంత్ రెడ్డి పాలన మీద మార్చి 12న మరోసారి కదనబేరి మోగించేందుకు పార్టీ సిద్ధమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

నిన్న మహబూబ్ నగర్(Mahbub Nagar) సభలో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఆశ్చర్యాన్ని కలిగించాయన్నారు. జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతున్నానని… కడుపు చింపుతానని… పేగులు మెడలో వేసుకొని తిరుగుతానని… మా ప్రభుత్వాన్ని ఏమైనా చేస్తే మానవ బాంబులా మారుతానని అంటున్నారని.. ఇవేం మాటలు? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఎక్కడైనా జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతారా… జేబు దొంగలే అలా తిరుగుతారని ఎద్దేవా చేశారు. అంతకుముందేమో సచివాలయానికి వచ్చి లంకె బిందెలు దొరుకుతాయని భావించానని అన్నాడని గుర్తు చేశారు. ఈ లంకె బిందెలు ఏంది? జేబులో కత్తెర ఏంది? అని చురక అంటించారు. ముఖ్యమంత్రి మాట్లాడే మాటలా ఇవి… ఈ ప్రస్టేషన్ ఎందుకు? ఆవేశంతో ఊగిపోవడం ఎందుకు? మానవ బాంబును కూడా అవుతానని చెప్పాడని మండిపడ్డారు.

read also :CM Revanth : మల్లారెడ్డి కాళ్లబేరానికి వచ్చినట్లేనా..?

తాను రేవంత్ రెడ్డికి ఓ విజ్ఞప్తి చేస్తున్నానని… కాంగ్రెస్ పార్టీలో నీ పక్కనే బాంబులు ఉన్నాయని… నల్గొండ బాంబు, ఖమ్మం బాంబులు మీ ప్రభుత్వం మీద చేసేదేంత వారే చేస్తారన్నారు. రేవంత్ రెడ్డి అయిదేళ్లు అధికారంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని… 420 హామీలు అమలు చేయాలని కోరుకుంటున్నామన్నారు. వెలుగు… చీకటి రెండు చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుందని… అలాగే కేసీఆర్, రేవంత్ రెడ్డిని చూశాక కేసీఆర్ విలువ ప్రజలకు తెలుస్తుందన్నారు. అందుకే రేవంత్ రెడ్డి బీపీ పెంచుకొని ఆగమాగం కావొద్దని.. మా నుంచి ఎలాంటి ప్రమాదం ఉండదని హామీ ఇచ్చారు. రేవంత్ రెడ్డికి ప్రమాదం అంటూ ఉన్నదంటే ఆయన పక్కన కూర్చున్న కాంగ్రెస్ నేతల నుంచే అన్నారు. బీపీ గోలీలు వేసుకొని హాయిగా ఉండాలని వ్యాఖ్యానించారు.

read also :Half Day schools : ఈ నెల‌ 15 నుంచి తెలంగాణ‌లో ఒంటిపూట బ‌డులు..

గుజరాత్ మోడల్ గొప్పదని రేవంత్ రెడ్డి అంటున్నారని… నోటికి వచ్చినట్లు అబద్దాలు చెప్పడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. మన రైతుబంధును కాపీ కొట్టి కేంద్రం పీఎం కిసాన్ పెట్టిందని తెలిపారు. అలాగే మిషన్ కాకతీయను కాపీ కొట్టి అమృత్ సరోవర్ అని పేరు పెట్టారన్నారు. రాహుల్ గాంధీయేమో గుజరాత్ మోడల్ అట్టర్ ప్లాప్ అంటే రేవంత్ రెడ్డేమో గుజరాత్ మోడల్ కావాలని అంటున్నారని ధ్వజమెత్తారు. మూడు నెలల్లోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజాభిమానం కోల్పోయిందన్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • ktr
  • Mahaboobnagar
  • revanth reddy

Related News

Ktr Jubilee Hills Bypoll Ca

Fake Votes : కేటీఆర్ చెప్పింది అంత అబద్దమే..దొంగ ఓట్లు సృష్టిచిందే బిఆర్ఎస్ పార్టీ

Fake Votes : ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా పేర్కొంది

  • Jubilee Hills Bypoll Exit P

    Jubilee Hills Bypoll Exit Poll : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం

  • Ktr Jubilee Hills Bypoll Ca

    Jubilee Hills Bypoll : కేటీఆర్ ఏంటి ఈ దారుణం..?

  • Vote Chori Jublihils

    Vote Chori : జూబ్లీహిల్స్‌లో ఓట్ల చోరీ

  • Jubilee Hills

    JubileeHills: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. రేపే నోటిఫికేషన్ విడుదల!

Latest News

  • Weight Loss Tips: 15 రోజుల్లో పొట్ట ఉబ్బరం సమస్యను త‌గ్గించుకోండిలా!

  • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

  • Shreyas Iyer: హీరోయిన్‌తో శ్రేయ‌స్ అయ్య‌ర్ డేటింగ్‌.. వీడియో వైర‌ల్‌!

  • India Playing XI: రేపు ఆసీస్‌తో తొలి వ‌న్డే.. భార‌త్ తుది జ‌ట్టు ఇదేనా?

  • India- Russia: చైనాకు చెక్ పెట్టేందుకు సిద్ధ‌మైన భార‌త్‌- ర‌ష్యా?!

Trending News

    • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

    • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

    • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

    • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd