Gold Buying: బంగారం కొంటున్నారా..ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోండి?
భారతీయులు బంగారాన్ని ఎంతగా ఇష్టపడతారో మనందరికీ తెలిసిందే. బంగారాన్ని ఒక ఆస్తిగా భావిస్తూ ఉంటారు.
- By Anshu Published Date - 07:40 AM, Fri - 2 September 22
భారతీయులు బంగారాన్ని ఎంతగా ఇష్టపడతారో మనందరికీ తెలిసిందే. బంగారాన్ని ఒక ఆస్తిగా భావిస్తూ ఉంటారు. అంతేకాకుండా చాలామంది కష్టపడి సంపాదించిన డబ్బుతో వారికి ఇష్టమైన బంగారు నగలను చేయించుకుంటూ ఉంటారు. అయితే బంగారం కొనే సమయంలో కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. బంగారం కొనే సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం.. బంగారం ధర నిత్యం మారుతూ ఉంటుంది. ఈ బంగారం ధరలను పేరున్న వెబ్సైట్లో మాత్రమే పొందుపరుస్తూ ఉంటారు.
అయితే బంగారం కొనుగోలు చేసే ముందు నాలుగైదు షాపులు ధరల వివరాలు కనుక్కొని ఆ తర్వాత ఎక్కడ తక్కువగా ఉంటుందో అక్కడ నగలు కొనుగోలు చేయాలి. ఇక నగల బంగారాన్ని 22 క్యారెట్లు 18 క్యారెట్లు 14 క్యారెట్ల స్వచ్ఛతతో తయారుచేస్తారు అన్న విషయం తెలిసిందే. ఇటువంటి బంగారాన్ని కొన్నా కూడా దానిపై బిఐఎస్ హాల్ మార్క్ గుర్తుండి తీరాలి. ఒకవేళ అటువంటి గుర్తు లేకపోతే అటువంటి గోల్డ్ ను కొనుగోలు చేయకూడదు. అలాగే జువెలరీ షాపు వారు బంగారు నగలపై తరుగు,మజూరి పేరుతో అదనపు చార్జీలను వేస్తూ ఉంటారు.
ఇవి ఒక్కొక్క షాపులో ఒక్కొక్క విధంగా ఉంటాయి. కాబట్టి ఎక్కడ అయితే తరువు చార్జీలు తక్కువగా పడతాయో అక్కడే కొనుగోలు చేయడం మంచిది. అలాగే మీరు కొనే నగల్లో రాళ్లు ఉంటే ధర ఎక్కువగా ఉంటుంది. రాళ్ల వల్ల నగల తయారీలో వేస్టేజ్ ఎక్కువగా ఉంటుంది. పనికిరాళ్లకు అంతగా విలువ ఉండదు. కొనుగోలు చేసే వారు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని బంగారాన్ని కొనుగోలు చేయడం మంచిది. అలాగే నగల షాపు వారు కావాలనే ధర ఎక్కువగా చెప్పి ఆఫర్లు డిస్కౌంట్లు ఇస్తూ ఉంటారు. అలాగే డిస్కౌంట్లు,ఆఫర్లు పోగా ఎంత చెల్లించాల్సి వస్తుందో ముందే గమనించుకోవాలి. అలాగే బిల్లు ఇవ్వని షాపుల్లో నగలు ఎప్పుడు కొనుగోలు చేయకూడదు. ఎందుకంటే భవిష్యత్తులో మీరు నగలు అమ్మాలి అనుకుంటే ఆ బిల్లు మీకు చాలా అవసరం అవుతుంది. అంతేకాకుండా బంగారం విషయంలో మోసం జరిగితే కోర్టులో బిల్లు మీకు ఆధారంగా పనిచేస్తుంది.