kerala police: హైటెక్ ఐడియా అదిరింది బాస్!
భలేదొంగ, మంచి దొంగ, జేబుదొంగ, కొండవీటి దొంగ, యమదొంగ... ఇలా సిల్వర్ స్క్రీన్ దొంగల గురించి తెలుగువారికి బాగా తెలుసు. కానీ కేరళలో పోలీసులకు ఓ దొంగ మాత్రం చుక్కలు చూపిస్తున్నాడు.
- By Hashtag U Published Date - 07:03 PM, Sun - 20 March 22
భలేదొంగ, మంచి దొంగ, జేబుదొంగ, కొండవీటి దొంగ, యమదొంగ… ఇలా సిల్వర్ స్క్రీన్ దొంగల గురించి తెలుగువారికి బాగా తెలుసు. కానీ కేరళలో పోలీసులకు ఓ దొంగ మాత్రం చుక్కలు చూపిస్తున్నాడు. వాడి గురించి మాత్రం వాళ్లు ఏమీ తెలుసుకోలేకపోతున్నారు. ఆ దొంగ ఎలాంటివాడు అంటే.. సింపుల్ గా, దర్జాగా తాను కోరుకున్నది దోచేసుకుంటాడు. తీరా పనయ్యాక.. ఎక్కడైనా ఒక్క క్లూ అయినా విడిచిపెట్టకుండా జాగ్రత్తపడతాడు. అందుకే వాడు ఎంతకీ దొరకడు. ఆఖరికి వేరే దారిలేక వాడిని పట్టుకోవడం కోసం కేరళ పోలీసులు స్పెషల్ స్కెచ్ వేయాల్సి వచ్చింది.
కేరళలోని కాసరగొడ్ జిల్లా పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడో దొంగ. ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే.. వాడు దొరకడం లేదు. దీంతో ఏం చేయాలో పాలుపోని పోలీసులు.. కేసును మూసేయలేక.. ఓ కొత్త స్కెచ్ వేశారు. ఆ దొంగ పేరుతోపాటు ఫోటోను ఉపయోగించి ఓ వాట్సప్ గ్రూపును తయారుచేశారు. అందులో ఆ దొంగ ఎక్కువగా దోచుకునే ప్రాంతపు వాసులను యాడ్ చేశారు. ఈ వాట్సప్ గ్రూప్ ద్వారా.. దొంగకు సంబంధించిన సమాచారం ఏమాత్రమైనా తెలుస్తుందని వాళ్లు ఈ పనిచేశారు. ఇప్పటికే ఈ గ్రూపులో 251 మందిని చేర్చారు. ఈ వాట్సప్ సందేశాలపైనా నిఘా పెట్టారు. ఇంతకీ ఆ దొంగ ఎవరంటే.. అశోకన్. మడిక్కాయ్ గ్రామవాసి అయిన ఓ మహిళపై దాడి చేసి బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లాడు. కేసు రిజిస్టర్ చేసుకున్న హోస్దుర్గ్ పోలీసులు.. ఎక్కడ వెదికినా ఆ దొంగ దొరకలేదు. అందుకే ఈ వాట్సప్ గ్రూప్ ను ఏర్పాటుచేశారు.
ఆ దొంగకు స్నేహితుడైన మంజునాథన్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే.. అశోకన్ సమీపంలోని అడవిలోకి వెళ్లి దాక్కున్నాడని తేలింది. దీంతో అశోకన్ కు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవడానికే ఈ వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేశారు. మొత్తానికి దొంగ దొరికినా దొరకకపోయినా.. వాడి కోసం వేసిన ఈ వాట్సప్ గ్రూప్ ఎత్తుగడ మాత్రం అందరినీ ఆకర్షిస్తోంది. హైటెక్ ఐడియా అదిరింది బాస్!
Tags
Related News
Sonu Sood WhatsApp: యాక్టీవ్ మోడ్ లో సోనూసూద్ వాట్సాప్ అకౌంట్
బాలీవుడ్ నటుడు సోనూసూద్ గత రెండు రోజులుగా తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. వాస్తవానికి అతని వాట్సాప్ ఖాతా బ్లాక్ అయింది. దీని కారణంగా సోనూ సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది. అయితే 61 గంటల తర్వాత అతని వాట్సాప్ ఖాతా మళ్లీ యాక్టివ్గా మారింది.