HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Kerala Diamond Ring 24679 Diamonds

Diamond Ring: వామ్మో.. 24,679 వజ్రాలు పొదిగిన ఉంగరం.. ఎవరి దగ్గర ఉందొ తెలుసా?

సాధారణంగా చాలామంది మంచి మంచి కాస్ట్లీ డైమండ్ లు కలిగిన ఉంగరాలను ధరిస్తూ ఉంటారు. ఇంకా బాగా

  • Author : Anshu Date : 17-07-2022 - 8:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Diamond Ring
Diamond Ring

సాధారణంగా చాలామంది మంచి మంచి కాస్ట్లీ డైమండ్ లు కలిగిన ఉంగరాలను ధరిస్తూ ఉంటారు. ఇంకా బాగా ధనవంతులు కోటీశ్వరులు అయితే చిన్న చిన్న డైమండ్లతో పొదిగిన పెద్ద పెద్ద ఉంగరాలను ధరిస్తూ ఉంటారు. ఇంకొందరు మాత్రం ఓకే డైమండ్ ఉన్న ఉంగరాన్ని ధరిస్తూ ఉంటారు. ఇలా వజ్రాలు పొదిగిన ఉంగరాలు ఎన్నో రకాలుగా రకరకాల మోడల్స్ లభిస్తూ ఉంటాయి. కాగా ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఉంగరం గురించి తెలిస్తే తప్పకుండా షాక్ అవుతారు. ఎందుకంటే ఆ ఉంగరంలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 24,679 వజ్రాలు పొదిగి ఉన్నాయట.

ఒక్క ఉంగరంలో అన్ని వజ్రాలు ఏంటా అనే ఆశ్చర్యపోతున్నారా? మీరు విన్నది నిజమే. మరి ఆ ఉంగరం ఎక్కడ ఉంది? ఆ ఉంగరాన్ని ఎవరు ధరించారు అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..కేరళలోని కోజికోడ్‌కు చెందిన ఎస్‌డబ్ల్యుఏ డైమండ్స్ తాజాగా 24,679 వజ్రాలు పొదిగిన ఉంగరాన్ని తయారుచేసింది. ఈ డైమండ్ రింగ్ పింక్ ఓస్టెర్ మష్రూమ్ ప్రేరణగా నిలిచింది. గతంలో 12,638 వజ్రాలు అమర్చిన రింగ్ రూపొందించిన వారు ఈసారి ఏకంగా 24,679 డైమండ్లతో ఉంగరాన్ని తయారు చేశారు.

పాత రికార్డును ఈ కొత్త రింగు బద్దలు కొట్టింది. ది టచ్ ఆఫ్ అమీని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ విద్యార్థి రిజిషా టివి రూపొందించారు. అయితే ఈ ఉంగరాన్ని తయారు చేయడానికి 90 రోజుల పాటు శ్రమించారట. ఈ రింగ్‌లోని అన్ని వజ్రాలు కేపీసీఎస్ సర్టిఫికేట్ పొందాయట. టచ్ ఆఫ్ అమీ ప్రపంచంలోని అనేక దేశాలలో ప్రతిష్టాత్మక అవార్డులను గెలుచుకుంది. ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో కూడా స్థానం సంపాదించుకుంది. వజ్రాల పరిశ్రమలో అగ్రగామిగా ఉన్న భారత్ ఈ ఘనత సాధించడంపై తాము ఎంతో సంతోషిస్తున్నామని ఎస్ డబ్ల్యూఏ నిర్వాహకులు తెలిపారు. ఈ రింగుకీ సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • diamond
  • diamond ring
  • Guiness record
  • kerala

Related News

The Kerala Story 2

The Kerala Story 2: మరో చీకటి కోణం..ది కేరళ స్టోరీ2 ట్రైలర్‌ ఇంత ఘోరమా

Pinarayi Vijayan  ఫిబ్రవరి 27న విడుదల కానున్న ‘ది కేరళ స్టోరీ 2’ సినిమాపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ చిత్రం కేరళ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఉద్దేశపూర్వకంగా రూపొందించిన విద్వేషపూరిత ప్రచారమని ఆయన అభివర్ణించారు. శాంతియుతంగా ఉండే కేరళను ఉగ్రవాదానికి కేంద్రంగా చూపించే ప్రయత్నం ఈ సినిమా ద్వారా జరుగుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు. కోర్టులు, దర్

  • Kerala's Hi Lite Group Gift

    Luxury Cars : అబ్బ.. ఉద్యోగులకు లగ్జరీ కార్లు గిఫ్ట్ ఇచ్చిన కంపెనీ! చాల గ్రేట్ కదా !!

Latest News

  • డార్క్ షవరింగ్ అంటే ఏమిటి? దీనివల్ల ప్రయోజనాలు ఉన్నాయా?!

  • హెరిటేజ్ నాణ్యతపై భరోసా.. YCP అసత్య ప్రచారానికి ఢిల్లీ హైకోర్టు చెక్!

  • ఐటీ శాఖ టార్గెట్ లిస్ట్‌లో ప్ర‌ముఖులు!

  • అవయవ దానం అంటే ఏమిటి? ఎన్ని రకాలు?

  • ఈ ఏడాదిలో కారు కొన‌టానికి ఇదే మంచి స‌మ‌య‌మా?!

Trending News

    • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd