Kavitha : జూన్ 3 వరకు కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- By Latha Suma Published Date - 02:54 PM, Mon - 20 May 24

BRS MLC Kavitha : ఢిల్లీ మద్యం కేసు(Delhi liquor case)లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ రిమాండ్(Judicial remand)ను మరోసారి పొడిగించారు (extended). సీబీఐ కేసులో జూన్ 3 వరకు కవిత రిమండ్‌ను రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. ఈ మేరకు జడ్జి కావేరి బవేజా ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ కేసులో మార్చి 26 నుండి కవిత జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే.
We’re now on WhatsApp. Click to Join.
కాగా, ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ ఈరోజుతో(మంగళవారం) ముగియనున్నది. ఈడీ, సీబీఐ రెండు కేసుల్లోనూ విచారణ జరిగినట్లు తెలుస్తోంది. ఈ మేరకు రేపు మధ్యాహ్నం 2గంటలకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగించే విషయంపై రౌస్ అవెన్యూ కోర్టు విచారించనున్నది. జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో కవితను కోర్టులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈడీ, సీబీఐ అధికారులు హాజరుపరిచారు. సీబీఐ కేసులో కవిత రిమాండ్ జూన్ 3 వరకు పొడిగించింది.
Read Also: Bajaj Pulsar F250: బజాజ్ నుంచి మరో సూపర్ బైక్.. ధర ఎంతంటే..?
ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాలపై సీబీఐ, ఈడీ నమోదు చేసిన రెండు కేసుల్లోనూ నేటితో రిమాండ్ ముగుస్తోండటంతో కవితను ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరు పరిచారు. కవిత బెయిల్ కోసం ఆమె తరుఫు న్యాయవాదులు చాలా ప్రయత్నించారు. ఇప్పటికి పలుమార్లు ఆమెకు బెయిల్ రిజెక్ట్ అయిన విషయం తెలిసిందే.