India’s First 5G Call: 5జీ టెస్ట్ కాల్ సక్సెస్…!!
IIT మద్రాస్ లో కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ గురువారం 5జీ విజయవంతంగా టెస్ట్ కాల్ చేశారు. నెట్ వర్క్ భారత్ లో తొలిసారిగా డెవలప్ చేసినట్లు మంత్రి తెలిపారు.
- By Hashtag U Published Date - 05:10 AM, Fri - 20 May 22

IIT మద్రాస్ లో కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ గురువారం 5జీ విజయవంతంగా టెస్ట్ కాల్ చేశారు. నెట్ వర్క్ భారత్ లో తొలిసారిగా డెవలప్ చేసినట్లు మంత్రి తెలిపారు. IITమద్రాస్ లో 5జీ కాల్ విజయవంతంగా టెస్ట్ చేశాం…ఎండ్ టు ఎండ్ నెట్ వర్క్ ను భారత్ లో రూపొందించడంతోపాటు డెవలప్ చేశాం అంటూ కేంద్ర మంత్రి కూ యాప్ లో పోస్టు చేశారు.
ఈ క్రమంలో టెలికమ్యూనికేషన్స్ విభాగం 5జీ స్పెక్ట్రమ్ వేలం ప్రతిపాదనను వచ్చే వారం తుది ఆమోదం కోసం కేంద్ర కేబినెట్ ముందుంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 5జీ సేవలు ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి వస్తాయని అంచనా వేస్తున్నారు. కొత్త టెక్నాలజీ విద్య, వైద్యం, వ్యవసాయం, ఇంధనం వంటి రంగాల్లో డిజిటల్ టెక్నాలజీ సేవల రూపురేఖలను మార్చేస్తుందని ట్రాయ్ ఛైర్మన్ పీడీ వాఘేలా తెలిపారు.
Aatmanirbhar 5G 🇮🇳
Successfully tested 5G call at IIT Madras. Entire end to end network is designed and developed in India. pic.twitter.com/FGdzkD4LN0
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) May 19, 2022