Daimond Rains : ఆ రెండు గ్రహాలపై వజ్రాల వర్షం.. ఎందుకు, ఏమిటి, ఎలా?
వజ్రాల వర్షం కురిస్తే .. ఎలా ఉంటుంది. యావత్ ప్రపంచం పేదరికమే నిర్మూలన అవుతుంది.
- By Hashtag U Published Date - 06:30 AM, Wed - 7 September 22
వజ్రాల వర్షం కురిస్తే .. ఎలా ఉంటుంది. యావత్ ప్రపంచం పేదరికమే నిర్మూలన అవుతుంది.మన భూమిలో వజ్రాలు దొరుకుతాయి.. సముద్రంలో దొరుకుతాయి.. కానీ భూమిపై వజ్రాల వర్షం కురిసే ఛాన్స్ లేదు.యురేనస్, నెప్ట్యూన్ గ్రహాలపై మాత్రం వజ్రాల వర్షం కురిసేందుకు అనువైన వాతావరణం ఉందని అమెరికా శాస్త్రవేత్తలు అంటున్నారు. అమెరికా ఇంధన శాఖ, రోస్టక్ యూనివర్సిటీ పరిశోధకుల సంయుక్త అధ్యయనంలో ఈ వివరాలను గుర్తించారు. యురేనస్, నెప్ట్యూన్ గ్రహాలపై రసాయనిక చర్యల వల్ల ఏర్పడే వజ్రాలు మిలియన్ల కొద్దీ క్యారెట్లకు బరువు పెరుగుతాయని అంటున్నారు.అయితే యురేనస్, నెప్ట్యూన్ గ్రహాలపై మంచుదుప్పటి ఉంటుంది. గత కొన్ని వేల సంవత్సరాలుగా ఎన్నో వజ్రాలు అక్కడి మంచుపొరల్లో నిక్షిప్తమై ఉన్నట్లు తెలిపారు.
అసాధారణ అయస్కాంత క్షేత్రాల వల్లే..
యురేనస్, నెప్ట్యూన్ గ్రహాలపై ఉండే అసాధారణ అయస్కాంత క్షేత్రాల వల్లే అక్కడ వజ్రాలు ఏర్పడుతున్నాయని సైంటిస్టులు వివరించారు. ఆ గ్రహాలపై కార్బన్, హైడ్రోజన్ సహా పలు రసాయనిక పదార్థాల సమ్మేళనం వల్ల.. మితిమీరిన ఉష్ణోగ్రత, ఒత్తిడి కారణంగా వజ్రాలు ఏర్పడేందుకు బీజాలు పడుతున్నాయని వెల్లడించారు. 1 మైక్రో మీటర్ కంటే తక్కువ సైజు ఉన్న నానో డైమండ్స్ కూడా యురేనస్, నెప్ట్యూన్ గ్రహాలపై ఉన్నట్లు తెలిపారు.
ప్రయోగశాలలో వజ్రాన్ని ఎలా తయారు చేస్తారంటే…
కార్బన్ మూల ధాతువును ఓ మైక్రోవేవ్ చాంబర్ లో ఉంచి అత్యంత తీవ్ర ఉష్ణోగ్రతకు గురిచేస్తారు. అప్పుడది మెరిసే ప్లాస్మా బంతిలా తయారవుతుంది. కొన్నివారాల పాటు జరిగే ఈ ప్రక్రియల అనంతరం అణువులు స్ఫటికాలు, ఆపై వజ్రాలుగా రూపాంతరం చెందుతాయి.
ఆరు కోణాలు కలిగిన స్వచ్ఛమైన వజ్రం..
గ్రహశకలాలు ఢీకొట్టినప్పుడు ఏర్పడే వజ్రాలకు అసాధారణ లక్షణాలు ఉంటున్నాయని ఓ కొత్త అధ్యయనం ద్వారా తెలిసింది. ఈ వజ్రాలతో అత్యంత కఠినమైన వస్తువుల్ని తయారుచెయ్యవచ్చు అని తెలిసింది. బ్రిటన్, అమెరికా, హంగేరీ, ఇటలీ, ఫ్రాన్స్ కి చెందిన సైంటిస్టులు 1891లో అరిజోనా ఎడారి లో లభించిన లోన్స్డలీట్ ఖనిజాన్ని పరిశీలించారు. నిజానికి ఇది ఆరు కోణాలు కలిగిన స్వచ్ఛమైన వజ్రం. ఇది క్యూబ్ ఆకారంలో ఉండే సంప్రదాయ వజ్రాల కంటే భిన్నమైనది అని గుర్తించారు. ఇది గ్రహశకలం ఢీకొట్టడం వల్ల ఏర్పడింది.
Tags
Related News
James Web Telescope: సరికొత్త లుక్ లో కనిపిస్తున్న యురేనస్ గ్రహం.. ఫొటోస్ వైరల్?
ఈ అనంత విశ్వంలో, విశ్వంలోని ఎన్నో విషయాలను తెలుసుకోవడం కోసం శాస్త్రవేత్తలు నిరంతరం శ్రమిస్తూనే