Snake Head Alive : చనిపోయాక కూడా పాము తల సజీవంగానే ఉంటుందా ?
Snake Head Alive : పాము తల తెగిపోయిన తర్వాత కూడా కొన్ని గంటలపాటు సజీవంగానే ఉంటుంది. ఈవిషయం మీకు తెలుసా ?
- By Pasha Published Date - 01:32 PM, Tue - 3 October 23

Snake Head Alive : పాము తల తెగిపోయిన తర్వాత కూడా కొన్ని గంటలపాటు సజీవంగానే ఉంటుంది. ఈవిషయం మీకు తెలుసా ? అందుకే తెగిపోయిన పాము తలలో కూడా విషం ఉంటుందని మనం తెలుసుకోవాలి. తెగిపోయి విలవిలలాడుతున్న పాము తలకు దూరంగా ఉండటం సేఫ్. ఇప్పుడు ఈవిషయం చర్చకు ఎందుకు వచ్చిందంటే.. ప్రముఖ ప్రశ్న జవాబుల వేదిక Quoraలో ప్రస్తుతం ఈ టాపిక్ పై హాట్ డిబేట్స్ జరుగుతున్నాయి. ఈ టాపిక్ పై ఎంతోమంది ప్రశ్నలు వేస్తున్నారు. మరెంతో మంది ఆన్సర్స్ ఇస్తున్నారు. ‘‘పాముకు శ్వాస తీసుకోవడానికి ఎక్కువ ఆక్సిజన్ అవసరం లేదు. అందుకే దాని తల శరీరం నుంచి వేరుగా అయిన తర్వాత కూడా కొన్ని గంటల పాటు జీవించి ఉండగలదు’’ అని నిపుణులు అంటున్నారు. నరికేసిన తర్వాత కూడా పాము తలలో విషం సప్లై వర్క్స్ ను పర్యవేక్షించే కొన్ని నరాలు యాక్టివ్ గానే ఉంటాయని పేర్కొన్నారు. అయితే మొండెం లేకుండా ఎక్కువ గంటల పాటు పాము తల జీవించలేదని తేల్చి చెప్పారు.
We’re now on WhatsApp. Click to Join
ఈ డిబేట్ సందర్భంగా Quoraలో ఓ నెటిజన్ ఒక ఘటనను ఇలా వివరించాడు.. ‘‘2014 సంవత్సరంలో చైనాలోని ఓ రెస్టారెంట్‌లో డిన్నర్ కోసం పాము మాంసాన్ని వండేందుకు పెంగ్ ఫ్యాన్ అనే చెఫ్ రెడీ అయ్యాడు. అతడు మొదట పామును నరికేసి ముక్కలు చేశాడు. గిన్నెలో మిగతా పాము భాగాలతో పాటు తల కూడా వేశాడు. ఒక్కో పాము ముక్కను చేతితో తీసి నూనె గిన్నెలో వేస్తున్నాడు. ఈక్రమంలో పాము తల ముక్కను పట్టుకోగా.. అది అతడి చేయికి కాటేసింది. విషం ప్రభావంతో ఆ చెఫ్ అరవడం మొదలుపెట్టాడు. అక్కడున్న తోటి సిబ్బంది వచ్చి చూసే సరికి.. ఆ చెఫ్ చనిపోయాడు. పామును నరికేసిన 20 నిమిషాల తర్వాత ఇలా జరిగింది. అంటే అప్పటివరకు పాము తలలో విషం పంపిణీ చేసే వ్యవస్థ సజీవంగానే ఉందన్న మాట’’ అని నెటిజన్ చెప్పుకొచ్చాడు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3000 జాతుల పాములు ఉన్నాయి. అయితే వీటిలో దాదాపు 200 పాము జాతులు మాత్రమే విషపూరితమైనవని అంటారు.
Also read : Angallu Violence Case : సుప్రీంలో జగన్ సర్కారుకు ఎదురుదెబ్బ.. అంగళ్లు కేసులో 6 పిటిషన్ల కొట్టివేత