Household Budget : ‘ఇంటి బడ్జెట్’ పై కేంద్రమంత్రి పెమ్మసాని భార్య సూచనలు..
Household Budget : 'ఇంటి బడ్జెట్' (Household Budget) పై సరికొత్త ఐడియాతో సలహాలు ఇచ్చారు
- By Sudheer Published Date - 01:22 PM, Mon - 17 February 25

ఈరోజుల్లో ఎంత సంపాదించిన డబ్బు అనేది ఆదా చేసుకోలేకపోతున్నాం. రోజువారీ ఖర్చులు పెరిగిపోవడం , పిల్లల స్కూల్ ఫీజులు , ఇంట్లో ఖర్చులు , నిత్యావసర ధరలు పెరిగిపోవడం ఇలా ఎన్నో ఖర్చులు పెరిగిపోతుండడంతో సంపాదించిందంతా ఖర్చులకే సరిపోతున్నాయి. దీంతో ప్రతి కుటుంబంలో సేవింగ్ అనేది లేకుండా పోతుంది. ఈ క్రమంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ (Union Minister Pemmasani Chandrashekhar) సతీమణి డాక్టర్ రత్న(Doctor Ratna).. ‘ఇంటి బడ్జెట్’ (Household Budget) పై సరికొత్త ఐడియాతో సలహాలు ఇచ్చారు. కేంద్ర, రాష్ట్ర బడ్జెట్‌లు ఉన్నట్లే.. ఇంటి బడ్జెట్ కూడా ప్లాన్ చేసుకోవచ్చన్నారు. 50-30-20 నియమం ప్రకారం డబ్బుల్ని పొదుపు చేయొచ్చంటూ ఓ వీడియోను విడుదల చేసారు. ఈ వీడియో ను కేందమ్రంతి పెమ్మసాని చంద్రశేఖర్ ట్వీట్ చేశారు. ఈ సలహాలు పాటించండి అంటూ అందరికి సూచించారు.
Fastags Rules : నేటి నుండి కొత్త ఫాస్టాగ్ నియమాలు.. ఏమి మారాయి? జరిమానాలు ఏమిటి?
ఇక ఇంటి బడ్జెట్ గురించి డాక్టర్ రత్న ఎన్నో ఆసక్తికర విషయాలు తెలియజేసారు. నెల, ఏడాదికి సంపాదన ఎంత, ఖర్చు ఎంత వంటి అంశాలను ప్రస్తావిస్తూ ఇంటి బడ్జెట్ ఎలా ప్లాన్ చేసుకోవాలో వివరించారు. ప్రతి నెలా వచ్చే సంపాదన ఎంత.. ఖర్చులు ఎంత.. వాటిని ఎలా డీల్ చేయాలో చెప్పుకొచ్చారు. కొందరు డబ్బులు బాగా సంపాదిస్తున్నా ఆర్థిక నిర్వహణ సరిగా లేక ఇబ్బందిపడుతున్నారన్నారు. ప్రస్తుత, భవిష్యత్తు అవసరాలు, అత్యవసరాలను అంచనా వేయలేకపోతున్నారని.. అందుకే వచ్చిన ఆదాయానికి మించి అప్పులు చేస్తున్నారన్నారు. ఇంకా ఏమేమి చెప్పారో..ఎలాంటి సలహాలు ఇచ్చారో..మీరే చూడండి.