Messages Via Satellite : ఇక సిగ్నల్స్ లేకున్నా మెసేజ్ పంపొచ్చు.. ఎలా ?
Messages Via Satellite : మనం వాడే చాలావరకు స్మార్ట్ ఫోన్లలో ఉండే సాఫ్ట్‌వేర్ పేరు ఆండ్రాయిడ్.
- By Pasha Published Date - 09:00 AM, Thu - 4 April 24

Messages Via Satellite : మనం వాడే చాలావరకు స్మార్ట్ ఫోన్లలో ఉండే సాఫ్ట్‌వేర్ పేరు ఆండ్రాయిడ్. ఇది గూగుల్ కంపెనీకి చెందిన సాఫ్ట్ వేర్. ఆండ్రాయిడ్ 15 ఫుల్ వర్షన్ ఆగస్టు-సెప్టెంబర్ నెలల్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇందులో మరో సరికొత్త ఫీచర్ వస్తోంది. అదే.. ‘శాటిలైట్ మెసేజింగ్’!! మారుమూల ప్రాంతాల్లో నుంచి అత్యవసర పరిస్థితుల్లో మెసేజ్‌లు చేసుకునేందుకు ఈ ఆప్షన్ ఉపయోగపడుతుంది. త్వరలో విడుదల కానున్న ఆండ్రాయిడ్ 15 బీటా వెర్షన్లో ‘శాటిలైట్ మెసేజింగ్’ ఫీచర్ అందుబాటులోకి వస్తుంది. దీని ద్వారా మనం అత్యవసర పరిస్థితుల్లో ఎక్కడ నుంచైనా, ఎవరికైనా మెసేజ్‌లను పంపొచ్చు. వైఫై , మొబైల్ నెట్వర్క్ సిగ్నల్స్ లేకున్నా మెసేజ్‌ను పంపే వీలుంటుంది. ప్రత్యేకించి మారుమూల ప్రాంతాల్లో నివసించే వారికి ఈ ఫీచర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ‘శాటిలైట్ మెసేజింగ్’ ఫీచర్(Messages Via Satellite) ఇప్పటికే ఐఫోన్స్‌లో అందుబాటులోకి వచ్చేసింది. అయితే అది అత్యవసర సేవలకు పరిమితం. ఆండ్రాయిడ్ 15 బీటా వెర్షన్లో ‘శాటిలైట్ మెసేజింగ్’ను అత్యవసర సేవలతో పాటు మెసేజ్‌లు పంపడానికి, రిసీవ్ చేసుకోవడానికి కూడా వాడుకోవచ్చు. ఈ ఫీచర్‌ను వాడుకొని మనం ఫొటోలు, వీడియోలను సెండ్ చేయలేం. గూగుల్ కంపెనీ ఆండ్రాయిడ్ 15 అప్డేట్లో 3 కీలకమైన అంశాలపై దృష్టిసారించింది. అవి ప్రైవసీ/ సెక్యూరిటీ, సపోర్టింగ్ క్రియేటర్స్ అండ్ డెవలపర్స్, మాక్సిమైజింగ్ యాప్ పెర్ఫార్మెన్స్.
We’re now on WhatsApp. Click to Join
ఏ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకోవచ్చు ?
ఆండ్రాయిడ్ 15 అనేది ఇంకా టెస్టింగ్ దశలోనే ఉంది. ప్రస్తుతానికి గూగుల్ పిక్సెల్, ట్యాబ్లెట్స్‌లో మాత్రమే ఆండ్రాయిడ్ 15 డెవలపర్ ప్రివ్యూ 1ను టెస్ట్ చేయడానికి వీలవుతుంది. పిక్సెల్ 8, పిక్సెల్ 8ప్రో, పిక్సెల్ 7, పిక్సెల్ 7 ప్రో, పిక్సెల్ 7ఏ, పిక్సెల్ 6, పిక్సెల్ 6 ప్రో, పిక్సెల్ 6ఏ, పిక్సెల్ ఫోల్డ్, పిక్సెల్ ట్యాబ్లెట్‌ల్లో ఆండ్రాయిడ్ 15ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Also Read : Jaya Prada Desire : ఏపీ ఎన్నికల్లో పోటీ చేస్తా.. బీజేపీ పెద్దల నిర్ణయమే ఫైనల్ : జయప్రద
సాధారణ యూజర్ల సంగతేంటి ?
ప్రస్తుతం ఆండ్రాయిడ్ 15 పరీక్షల దశలో ఉంది. అందుకే దీన్ని సాధారణ యూజర్లు డౌన్ లోడ్ చేసుకోకపోవడమే బెటర్. అంతగా కావాలంటే ఆండ్రాయిడ్ 15 ఫస్ట్ ప్రివ్యూను డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. కనీసం బీటా వెర్షన్ రిలీజ్ అయ్యే వరకు ఎదురుచూడటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పుడు డెవలపర్లు దీన్ని డౌన్లోడ్ చేసుకొని వాడొచ్చు.