Keema Pizza: రెస్టారెంట్ స్టైల్ కీమా పిజ్జా ఇంట్లోనే తయారు చేసుకోండిలా?
ఈ రోజుల్లో చిన్నవారి నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ ఇష్టపడే తినే వంటల్లో పిజ్జా కూడా ఒకటి. పిజ్జాలో ఎన్నో రకాలు ఉన్నాయి అన్న విషయం మ
- By Nakshatra Published Date - 10:40 PM, Sun - 3 September 23
ఈ రోజుల్లో చిన్నవారి నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ ఇష్టపడే తినే వంటల్లో పిజ్జా కూడా ఒకటి. పిజ్జాలో ఎన్నో రకాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. వెజిటేబుల్ పిజ్జా నాన్ వెజ్ పిజ్జా అంటూ రకరకాలుగా ఉన్నాయి. అయితే ఎప్పుడైనా కీమా పిజ్జా తిన్నారా. ఒకవేళ తినకపోతే రెస్టారెంట్ స్టైల్లో కీమా పిజ్జా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
కీమా పిజ్జాకి కావలసిన పదార్థాలు:
కీమా – ఒక కప్పు
పిజ్జా బేస్ – రెండు
ఛీజ్ – 100 గ్రామ్స్
నూనె – 1 టేబుల్ స్పూన్
షాజీరా – ½ టీ స్పూన్
ఉప్పు – ½ టేబుల్ స్పూన్
కారం – ½ టేబుల్ స్పూన్
ధనియాలపొడి – ½ టేబుల్ స్పూన్
అల్లం వెల్లుల్లి ముద్ద – 1 టేబుల్ స్పూన్
టమాటో కెచప్ – 2 టేబుల్ స్పూన్లు
కీమా పిజ్జా తయారీ విధానం:
ముందుగా కీమాలో కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం, కొంచెం అల్లం వెల్లులి ముద్ద వేసి, నీళ్ళు పోయకుండా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక బాణలిలో నూనె వేసి, షాజీర, అల్లం వెల్లులి ముద్ద వేసి వేపాలి.అల్లం వెల్లులి ముద్ద కొద్దిగా వేగిన తరువాత ముందుగా ఉడకబెట్టిన కీమా వేసి మూత పెట్టి, కీమాలో నీళ్ళు ఇమిరిపోయే వరకు ఉడకపెట్టాలి. కీమాలో నీళ్ళు మొత్తం ఇగిరిపోయాక మిగిలిన ఉప్పు, కారం, ధనియాలపొడి వేసి కలపాలి.కీమా బాగా వేగిన తరువాత తీసి పక్కన పెట్టాలి. తరువాత పిజ్జా బేస్ తీసుకుని కత్తితో నాలుగు భాగాలుగా గాటు పెట్టుకోవాలి. దానిపైన టమాటో కెచప్ వేసి సమంగా పూయాలి. దీనిపైన కీమా వేసి సమంగా పరవాలి. దానిపైన ఛీజ్ తురుము వేయాలి. ఇలా తయారు చేసిన పిజ్జాని ముందుగా వేడిచేసి పెట్టుకున్న ఓవెన్లో బేక్ చేసుకోవాలి. లేదా ఒక నాన్ స్టిక్ పాన్ లో పిజ్జాని పెట్టి దానిపై మూత పెట్టి స్టవ్ మీద సన్నని సెగతో పాన్ పిజ్జా చేసుకోవచ్చు. ఛీజ్ కరిగి పిజ్జా లేత గోధుమ రంగులోకి వచ్చినప్పుడు బయటకు తీసి, దానిమీద చిల్లి ఫ్లేక్స్ గాని ఒరిగానో గాని చల్లి వేడివేడిగా వడ్డించాలి.
Related News
Keema Pizza: ఎంతో స్పైసీగా టేస్టీగా ఉండే కీమా పిజ్జా.. తయారీ విధానం?
ఈ మధ్య కాలంలో పిల్లలు పెద్దలు చాలామంది ఇష్టపడుతున్న ఫుడ్స్ లో పిజ్జా కూడా ఒకటి. సండే వచ్చింది ఫ్యామిలీ అందరూ ఉన్నారు అంటే చాలు వెంటనే పి