HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Trending
  • >Get Your Horoscope Predictions For All Zodiac Signs In Telugu For Friday August 25th

Today Horoscope : ఆగస్టు 25 శుక్రవారం రాశి ఫలితాలు.. వారి డబ్బు ఎక్కడైనా చిక్కుకుపోవచ్చు

Today Horoscope : మేష రాశి నుంచి మీన రాశి వరకు ఈరోజు రాశి ఫలితాలు ఇవీ..  

  • By Pasha Published Date - 07:23 AM, Fri - 25 August 23
  • daily-hunt
Today Horoscope
Today Horoscope

Today Horoscope : మేష రాశి నుంచి మీన రాశి వరకు ఈరోజు రాశి ఫలితాలు ఇవీ..  

మేష రాశి

ఈరోజు మేషరాశి వారు పనిపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. అప్పుడే మీరు ఏ పనినైనా పూర్తి చేసి విజయం సాధించగలుగుతారు. ఈరోజు మీకు కొత్త ఆదాయ వనరులొస్తాయి. మీకు పాత పెట్టుబడిదారుల నుంచి ప్రయోజనం లభిస్తుంది. మీ కుటుంబ సభ్యులతో సాయంత్రం సరదాగా గడుపుతారు. విద్యార్థులు విదేశాల్లో విద్యను అభ్యసించేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది.

వృషభ రాశి

ఈరోజు వృషభ రాశి వారికి ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు అనుకూల సమయం. పై అధికారుల మన్ననలు పొందుతారు. ఆహార విషయాల్లో జాగ్రత్తలు వహించండి. అనారోగ్య సమస్యలు ఉండవు. మీకు సహాయం చేయడానికి సన్నిహితులు ముందుకు వస్తారు. కుటుంబములో సమస్యల వల్ల మీరు నిరాశకు గురవుతారు. తొందరపాటు నిర్ణయాలు తగవు. ఆచితూచి వ్యవహరించండి. ఈరోజు లక్ష్మీదేవిని పూజించండి. ఈరోజు క్షీరాన్నాన్ని లక్ష్మీదేవికి నివేదించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. లక్ష్మీస్తోత్రం పఠించండి.

మిథునం

ఈరోజు మిథునరాశి వారు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. మీ లక్ష్యాలపై దృష్టి కేంద్రీకరించండి. మీ పనిలో నాణ్యత పెరుగుతుంది. మీరు సాధించిన విజయాలతో మీరు సంతృప్తి చెందలేరు. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన విషయాల్లో ఇరుక్కుపోయే అవకాశం ఉంది.

Also read:Too Much Work: డిజిటల్ పరికరాలు ఎక్కువగా ఉపయోగిస్తే పిల్లలు పుట్టరా.. ఇందులో నిజమెంత?

కర్కాటకం

ఈరోజు కర్కాటక రాశి వారు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు ఏదైనా సమస్య ఉంటే, అది ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఈ కారణంగా మీరు కొంత ఆందోళన చెందుతారు. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. ఉద్యోగులకు కార్యాలయంలో పనిభారం పెరగొచ్చు. మరోవైపు మీ భాగస్వామి సహాయంతో మీరు పనులను పూర్తి చేయగలుగుతారు.

సింహం

ఈరోజు సింహరాశి వారికి మధ్యస్థం నుండి అనుకూలంగా ఉన్నది. ఉద్యోగస్తులకు మీరు చేసే ఉద్యోగంలో ప్రత్యేక గుర్తింపు గౌరవం లభిస్తుంది. ఆరోగ్యకరమైన జీవితం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుంటారు. విద్యార్థులకు అనుకూలం. ముఖ్యంగా బాలికలకు అనుకూలం. కుటుంబ పనులలో మీ పిల్లలు మీకు సహాయపడతారు. నూతన వ్యక్తులతో పరిచయం. లాభాలను పొందుతారు. రాజకీయ నాయకులకు అనుకూలం. మరింత శుభఫలితాలు పొందాలంటే మహాలక్ష్మి అష్టకాన్ని పఠించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. అలాగే పాలతో చేసిన తీపి పదార్థాలను భగవంతునికి నివేదన చేయండి. ఈరోజు కృష్ణాష్టకం పఠించడం వల్ల మరింత శుభఫలితాలు కలుగుతాయి.

కన్య (Today Horoscope)

ఈరోజు కన్యారాశి వారు ఆధ్యాత్మిక వ్యవహారాలపై ఆసక్తి కలిగి ఉంటారు. మీ పనితీరుతో ప్రశంసలు అందుకుంటారు. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు.  ఉద్యోగులు సహోద్యోగుల నుంచి మద్దతు పొందుతారు. మీరు తీసుకున్న నిర్ణయాలకు మంచి ప్రశంసలు లభిస్తాయి.  శత్రువులు బలహీనపడతారు.

Also read: Morning Drinks: ఉదయం సమయంలో ఈ డ్రింక్స్ తాగితే చాలు.. ఆ సమస్యలన్నీ మటుమాయం?

తుల

ఈరోజు తులారాశి వారు కుటుంబ జీవితంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీ డబ్బు ఎక్కడైనా చిక్కుకుపోవచ్చు. మీరు మీ బంధువుల నుంచి కొన్ని శుభవార్తలు వింటారు. మీ సౌకర్యాల కోసం కొంత డబ్బును ఖర్చు చేస్తారు. ఉద్యోగులు కార్యాలయంలో సహోద్యోగులు కూడా ఈరోజు కలిసి పని చేయడం ఆనందంగా ఉంటుంది. మీ వేతనం పెరుగుదల గురించి శుభవార్తలు వినిపిస్తాయి. దీంతో మీ మనసు సంతోషంగా ఉంటుంది.

వృశ్చికం

ఈరోజు వృశ్చిక రాశివారు కుటుంబ సభ్యులతో ఆనందముగా గడుపుతారు. ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే వారికి అనుకూలం. శుభ కార్యాలకు హాజరవుతారు. విద్యార్థులు కష్టపడవలసిన సమయం. మీరు చేసే పనులలో విజయం సాధిస్తారు. మీరు తీసుకునే ఆహార అలవాట్లు మీకు ఇబ్బందికరమవుతాయి. జీర్ణ సంబంధిత సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించండి. వృత్తి ఉద్యోగాల్లో విజయం పొందుతారు. లక్ష్మీ అష్టకాన్ని పఠించండి. విష్ణు సహస్రనామం పఠించండి. అష్ట లక్ష్మీ స్తోత్రాన్ని పఠించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

ధనుస్సు

ఈరోజు ధనుస్సు రాశి వారికి మిశ్రమ ఫలితాలున్నాయి. ప్రారంభించిన పనులు సమయానికి పూర్తికావడం కష్టమే. వ్యాపారంలో మంచి ఫలితాలు పొందడం కష్టం. నూతన పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది. మీ జీవిత భాగస్వా మి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.  ఎవ్వరికీ అప్పులు ఇవ్వొద్దు.

మకరం

ఈరోజు మకర రాశి వారు శత్రువుల వల్ల కొంత ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. వ్యాపారులకు ఈరోజు ఎవరితోనైనా అభిప్రాయ భేదాలుంటే, దాంతో మీ పని పాడయ్యే అవకాశం ఉంది. మీ పిల్లల ఆరోగ్యంలో సమస్యలు రావొచ్చు. విద్యార్థులు ఈరోజు మంచి విజయాలు సాధించొచ్చు. మీ స్నేహితుల్లో ఎవరికైనా సహాయం చేయడానికి ముందుకొస్తారు.

Also read: Assam : అస్సాం బాంబు పేలుళ్ల కేసు : వారంతా నిర్ధోషులు ?

కుంభం

ఈరోజు కుంభ రాశి వారికి అంత అనుకూలంగా లేదు. మీ కుటుంబ సభ్యుల సహాయంతో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. ఖర్చులు నియంత్రించుకోవాలి. వ్యాపారస్తులకు అనుకూలం. ఉద్యోగస్తులకు అనుకూలం. శనివారం రోజు అభాగ్యులకు అన్నదానం చేయండి. ఈరోజు లక్ష్మీ అష్టోత్తర శతనామావళితో లక్ష్మీదేవిని పూజించడం, వరలక్ష్మీవ్రతం ఆచరించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. పంచదార వెన్న కలిపి బాలకృష్ణునికి నివేదించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

మీనం 

ఈరోజు మీన రాశి ఉద్యోగులకు ఒత్తిడి పెరుగుతుంది కానీ చేయాల్సిన పనిని తెలివిగా పూర్తిచేయడంలో సక్సెస్ అవుతారు. న్యాయపరమైన విషయాలు పరిష్కారం అవుతాయి. రోజంతా సంతోషంగా ఉంటారు. అనియంత్రిత ఆహారం విషయంలో ఈ రాశివారు అప్రమత్తంగా ఉండాలి.

గమనిక:  ఈ కథనంలో ఉన్న సమాచారం జ్యోతిష్యులు/ పంచాంగాలు/ ఉపన్యాసాలు/నమ్మకాలు/గ్రంధాల నుండి సేకరించిన తర్వాత మీ ముందుకు తీసుకురాబడింది. మా లక్ష్యం సమాచారాన్ని అందించడం మాత్రమే, దాని వినియోగదారులు దానిని కేవలం సమాచారంగా తీసుకోవాలి. అదనంగా, దాని యొక్క ఏదైనా ఉపయోగం వినియోగదారు యొక్క పూర్తి బాధ్యత.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • August 25th
  • friday
  • horoscope
  • horoscope in telugu
  • horoscope today
  • today horoscope

Related News

    Latest News

    • Khairatabad ganesh : గంగమ్మ ఒడికి చేరిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి

    • Renault Cars : జీఎస్టీ 2.0 ఎఫెక్ట్.. రెనో కార్లపై భారీ తగ్గింపు

    • South: ఏఐడీఎంకెలో ఉత్కంఠ.. పళణి స్వామి కీలక నిర్ణయాలు

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Viral : రూ.10 వేల కోట్ల ఆస్తి ఫుట్‌బాల్‌ స్టార్‌కి రాసిచ్చిన బిలియనీర్‌

    Trending News

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

      • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd