Social Media Trending: పవన్ మాల ధరించిన అభిమానులు..!!!
అభిమానం గుండెల్లో ఉండాలి. హద్దులు దాటకూడదు. హద్దులు దాటితే ఇలానే ఉంటుందని చెప్పడానికి ఉదాహరణ ఇదే.
- By hashtagu Published Date - 09:39 AM, Sat - 20 August 22

అభిమానం గుండెల్లో ఉండాలి. హద్దులు దాటకూడదు. హద్దులు దాటితే ఇలానే ఉంటుందని చెప్పడానికి ఉదాహరణ ఇదే. ప్రముఖ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అభిమానులు ఇప్పుడు పవన్ మాల ధరించి దీక్ష చేపట్టారు. దేవుళ్ల పేరుతో మాల వేయడం చూసాం…కానీ ఇప్పుడు పవన్ మాల ధరించడం అనేది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు, విజయవాడకు చెందిన పవన్ ఫ్యాన్స్ కొందరు పవన్ 49వ పుట్టినరోజు సందర్భంగా ఈ పవన్ మాల ను స్వీకరించి దీక్ష చేపట్టారు.
డాలర్ తో కూడిన మాలలను, ఎర్ర కుండవాలను ధరించడంతోపాటు మెడలో మతాలకు చెందిన లాకెట్లు వేసుకున్నారు. ఈ దీక్ష చేపట్టినవారు 21రోజులు లేదంటే…41రోజులు దీక్షలో ఉంటారు. దీక్ష చేపట్టివారు మండలకాలలో పవన్ కార్యక్రమలను, ఆయన ఆశయాలను ప్రజల్లో తీసుకళ్తూ…ఎన్నికల్లో విజయం కోసం ప్రచారం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. పవన్ స్పూర్తితో తాము కూడా ప్రజాసేవ చేస్తామని ప్రకటించారు. పవన్ మాల దీక్షకు సంబంధించి ఈ ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమల్లో వైరల్ అవుతున్నాయి.