HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Trending
  • >Fans Dance To Naatu Naatu At Rrr Screening In Los Angeles Theatre

RRR Fans In New York: నాటు నాటు పాట‌కు ర‌చ్చ.. ర‌చ్చ‌..!

RRR మూవీ తెలుగు సినిమా స్థాయిని మ‌రో మెట్టు ఎక్కించింద‌న‌టంలో ఎటువంటి సందేహం లేదు.

  • By Hashtag U Published Date - 11:58 PM, Sat - 1 October 22
  • daily-hunt
Rrr Imresizer
Rrr Imresizer

RRR మూవీ తెలుగు సినిమా స్థాయిని మ‌రో మెట్టు ఎక్కించింద‌న‌టంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఆర్ఆర్ఆర్ మూవీ విడుద‌లై ఆరు నెల‌లు దాటినా ఆ మూవీ క్రేజ్ మాత్రం తగ్గలేదు. జూ.ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఈ చిత్రం బ్లాక్‌బాస్ట‌ర్ హిట్‌గా నిలిచింది. విడుద‌లైన అన్ని భాష‌ల్లో ఈ సినిమాకు ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు.

అయితే ఈ మూవీలో నాటు నాటు పాట‌ను ఫ్యాన్స్ విప‌రీతంగా ఎంజాయ్ చేసిన విష‌యం తెలిసిందే. ఈ పాట‌లో చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ వేసిన‌ స్టెప్పులకు ప్రేక్ష‌కులు ఫుల్ ఎంజాయ్ చేశారు. అయితే ఈ పాట‌ను మ‌నం ఎంత ఆస్వాదించామో.. విదేశీయులు కూడా అంతే ఎంజాయ్ చేస్తున్నారు. నాటు నాటు పాట‌కు విదేశీయులు డ్యాన్స్ వేసిన వీడియో ఒక్క‌టి ట్విట్ట‌ర్‌లో వైర‌ల్‌గా మారింది.

తాజాగా బియాండ్‌ ఫెస్ట్‌లో భాగంగా అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌లోని ఓ థియేటర్‌లో ఆర్‌ఆర్‌ఆర్ మూవీ షో వేశారు. ద‌ర్శ‌కుడు రాజమౌళి కూడా స్వయంగా హాజరై అభిమానులతో కలిసి ఈ సినిమాను వీక్షించారు. ఈ షోకు సినీ అభిమానుల నుంచి విశేష స్పందన లభించింది. నాటు నాటు పాట కనిపించగానే పలువురు అభిమానులు డ్యాన్స్‌ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో హాల్‌చ‌ల్ చేస్తున్నాయి. మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ టాక్‌తో మొత్తంగా రూ.1200 కోట్ల పైచిలుకు కలెక్షన్లు రాబట్టింది. అక్టోబ‌ర్ 21న‌ ఈ మూవీ జ‌పాన్‌లో కూడా విడుద‌ల కానున్న విష‌యం తెలిసిందే.

pic.twitter.com/R66X4syu7G

— the Renata Adler of looking at your phone a lot (@alexmce) October 1, 2022


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Naatu Naatu dance
  • rrr
  • RRR fans in NEw York

Related News

    Latest News

    • CM Siddaramaiah : చలానాలపై రాయితీ ప్రకటించిన కర్ణాటక ప్రభుత్వం

    • Green Chillies : ప్రతిరోజూ పచ్చిమిర్చి తినడం ఆరోగ్యానికి మంచిదేనా?..అస‌లు రోజుకు ఎన్ని తిన‌వ‌చ్చు..?

    • Khairatabad ganesh : గంగమ్మ ఒడికి చేరిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి

    • Renault Cars : జీఎస్టీ 2.0 ఎఫెక్ట్.. రెనో కార్లపై భారీ తగ్గింపు

    • South: ఏఐడీఎంకెలో ఉత్కంఠ.. పళణి స్వామి కీలక నిర్ణయాలు

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd