Bandipur Elephants: బందీపూర్ ఫారెస్టులో కవలల ఏనుగులు..వైరల్ వీడియో..!!
ఏనుగు కవలలకు జన్మనివ్వడం చాలా అరుదు.
- By Hashtag U Published Date - 10:13 AM, Fri - 22 April 22

ఏనుగు కవలలకు జన్మనివ్వడం చాలా అరుదు. ఇలాంటి ఘటనలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. కర్నాటకలోని బందీపూర్ టైగర్ రిజర్వ్ అడవిలో ఏనుగు కవలలకు జన్మనిచ్చిన అరుదైన సంఘటన నెటిజన్లను ఆకట్టుకుంటోంది. అయితే పట్టిన కొద్ది నిమిషాల్లోనే అవి తన తల్లిని కోల్పోయే ప్రమాదం ఉండటంతో..వెంటనే అటవీశాఖ అధికారులు జోక్యంతో కవల ఏనుగు పిల్లలను రక్షించి…వాటి తల్లికి దగ్గరకు చేర్చారు. ఏనుగు తన కవలలతో ఉన్న వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
సఫారీలో ఉన్న కొంతమంది టూరిస్టులు, అటవీశాఖ సిబ్బంది రిసెప్షన్ సెంటర్లో ఉన్న ఏనుగును చూశారని…సఫారీ వ్యాన్ కు ఎదురుగా వస్తూ…నీటి గుంట దగ్గరున్న ఓ బండరాయి వైపు వెళ్లి..కవలల ఏనుగులకు జన్మనిచ్చిందని బందీపూర్ టైగర్ రిజర్వ్ డైరెక్టర్ రమేశ్ కుమార్ తెలిపారు. సఫారీ వాహనం డ్రైవర్ తమకు సమాచారం అందించడంతో..సంఘటనా స్థలానికి చేరుకుని నీటిలో ఉన్న ఏనుగుల పిల్లలను కాపాడినట్లు తెలిపారు. తల్లి ఏనుగు, పిల్ల ఏనుగులు క్షేమంగా ఉన్నాయన్నాన్నారు.