Elephant Attack: ఎటాక్ చేసిన కుర్రాడిని వణికించిన గజరాజు
మనిషికి జంతువులకు మధ్య బంధం తెగిపోతోంది. అడవులను (Forest) ఆక్రమించుకుంటున్న మనిషి జంతువులని వాటి సొంత నివాసంలో కనీసం తిరగనీయకుండా చేస్తున్నాడు.
- By Hashtag U Published Date - 02:52 PM, Mon - 5 December 22

మనిషికి జంతువులకు మధ్య బంధం తెగిపోతోంది. అడవులను (Forest) ఆక్రమించుకుంటున్న మనిషి జంతువులని వాటి సొంత నివాసంలో కనీసం తిరగనీయకుండా చేస్తున్నాడు. అందుకే అవి ఊళ్ల మీద పడుతున్నాయి. పంటలను, పొలాలను నాశనం చేస్తున్నాయి. దాడులకు పాల్పడుతున్నాయి. అలాంటి ఓ ఘటనే ఒకటి తాజాగా బయటపడింది.
అడవిలోకి (Forest) వెళ్లిన ఓ కుర్రాడు (Boy) అక్కడ సంచరిస్తున్న ఏనుగుల (Elephant) గుంపుని తరమాలని చూశాడు. తన దగ్గరున్న కర్రతో ఒక గజరాజు (Elephant) పై ఎటాక్ చేశాడు. అంతే, గజరాజు (Elephant)కి చిర్రెత్తుకొచ్చింది. అతని పై దాడి (Attack)కి ప్రయత్నించింది. కుర్రాడు భయపడి పారిపోయి ఏనుగు దాడి (Elephant Attack) నుంచి తప్పించుకున్నాడు. ఈ ఘటన మొత్తాన్ని పక్కనే ఉన్న మరో వ్యక్తి తన సెల్ ఫోన్ కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. మెహ్రా అనే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ దీన్ని ట్వీట్ చేయడంతో అది కాస్త వైరల్ అయింది. ఆ కుర్రాడు చేసిన పనికి జనం దుమ్మెత్తిపోస్తున్నారు.
Just madness…🐘#Wildlife #conflict @susantananda3
pic.twitter.com/Il8jx4AqgZ— Surender Mehra IFS (@surenmehra) December 4, 2022
Also Read: Long Journeys: దూరపు ప్రయాణంలో స్త్రీలకు టాయిలెట్ సమస్య..!