Viral video: పెంపుడు శునకాలకు పెళ్లి… 500 మందితో బరాత్… వైరల్ వీడియో..!!
రెండు శునకాలకు పెళ్లి...వినడానికి విచిత్రంగా ఉన్నా...ఇలాంటి ఘటనే జరిగింది ఉత్తరప్రదేశ్ లోని హమీర్పూర్ జిల్లా సుమెర్పూర్ లో. ఇద్దరు సాధువులు తాము పెంచుకున్న శునకాలకు హిందూ సంప్రదాయం ప్రకారం ఘనంగా పెళ్లి చేశారు.
- By hashtagu Published Date - 10:21 AM, Tue - 7 June 22
రెండు శునకాలకు పెళ్లి… వినడానికి విచిత్రంగా ఉన్నా… ఇలాంటి ఘటనే జరిగింది ఉత్తరప్రదేశ్ లోని హమీర్పూర్ జిల్లా సుమెర్పూర్ లో. ఇద్దరు సాధువులు తాము పెంచుకున్న శునకాలకు హిందూ సంప్రదాయం ప్రకారం ఘనంగా పెళ్లి చేశారు. అనంతరంగా గ్రాండ్ గా భారీ ఊరేగింపు నిర్వహించారు. భరువగా గ్రామంలో ఈ వింత వివాహం జరిగింది.
సౌంఖర్ అడవుల్లో మనసర్ బాబా శివాలయంలోని ప్రధాన పూజారి అయిన స్వామి ద్వారాక దాస్ మహారాజ్ ఓ శునకాన్ని పెంచుకుంటున్నారు. దానికి పెళ్లిచేయాలని భావించి… పరచావ్ లోని బజరంగబలి ఆలయ పూజారి అర్జున్ దాస్ పెంచుకుంటున్న శునకంతో వివాహం చేయాలని నిశ్చయించారు. అంతే ఇక ఈ నెల 5న ముహుర్తం ఫిక్స్ చేశారు. ఈ మ్యారేజ్ కు తన శిష్యులు, భక్తులను ఆహ్వానించారు. శునకాలకు హిందూ సంప్రదయం ప్రకారం శాస్త్రోక్తంగా పెళ్లి చేశారు. భూరి, కల్లూ అనే ఈ శునకాల వివాహానికి హాజరైన వారికి పసందైన వంటకాలను వడ్డించారు. వివాహం తర్వాత 500 మందితో బరాత్ నిర్వహించారు.
ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వధువు భూరి మెడ మంగళసూత్రం స్పెషల్ అట్రాక్షన్ గా నిలించింది. ఈ వివాహంపై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.
Tags
Related News
Rahul Gandhi Nomination: రాహుల్ గాంధీ నామినేషన్ కోసం యూపీకి బయల్దేరిన సీఎం రేవంత్
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నామినేషన్ ప్రక్రియలో పాల్గొనేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ జాతీయ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేతో కలిసి శుక్రవారం హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ఉత్తరప్రదేశ్‌కు ప్రత్యేక విమానంలో బయలుదేరారు