BRS: ఖమ్మం, మహబూబాబద్ ఎంపీ స్థానాలు గెలుస్తున్నాం: వద్దిరాజు ధీమా
- By Balu J Published Date - 08:53 PM, Mon - 13 May 24

BRS: 18వ పార్లమెంటు ఎన్నికల్లో ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంటు స్థానాలకు జరిగిన ఎన్నికలలో ఖమ్మం ఎంపీగా నామ నాగేశ్వరరావు, మహబూబాబాద్ ఎంపీగా మాలోత్ కవిత బీఆర్ఎస్ ఎంపీలుగా విజయం సాధిస్తారని ఎంపీ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మం ఎన్ ఎస్ టి రోడ్ లోని డా.బీ అర్ అంబేద్కర్ కాలేజీ లోని పోలింగ్ బూత్ లో కుటుంబ సమేతంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్న ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఖమ్మం ఉమ్మడి జిల్లాతో పాటు మహబూబాబాద్ పార్లమెంటు స్థానానికి జరిగిన పోలింగ్ సరళిని పరిశీలిస్తే రెండు స్థానాల్లోనూ బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో సంక్షేమ పాలన అందించిన కేసీఆర్ ను ప్రజలు గుండెల్లో పెట్టుకొని ఎన్నికల్లో టిఆర్ఎస్ కు మద్దతు పలకనున్నారని ఆయన అన్నారు. దేశంలోనే మరే రాష్ట్రంలోనూ అమలు చేయని సంక్షేమ పథకాలను అందించిన బిఆర్ఎస్ ప్రభుత్వం తప్పకుండా మళ్లీ ప్రజా మద్దతుతో అధికారంలోకి వస్తుందని ఆయన జోస్యం చెప్పారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు.