Expiry Date: తాగేనీటికి ఎక్స్ పరీ ఉంటుందా?
ప్రతి వస్తువుకు ఎక్స్ పరీ డేట్ ఉంటుంది .. నిర్ణీత గడువు తర్వాత దాన్ని వాడలేం.. అలాగే నీటికి కూడా ఎక్స్ పరీ డేట్ ఉంటుందా? నీటిని గరిష్టంగా ఎంతకాలం పాటు నిల్వ చేయొచ్చు ?
- By Hashtag U Published Date - 07:00 PM, Sat - 21 May 22
ప్రతి వస్తువుకు ఎక్స్ పరీ డేట్ ఉంటుంది .. నిర్ణీత గడువు తర్వాత దాన్ని వాడలేం.. అలాగే నీటికి కూడా ఎక్స్ పరీ డేట్ ఉంటుందా? నీటిని గరిష్టంగా ఎంతకాలం పాటు నిల్వ చేయొచ్చు ? అనే ప్రశ్నలకు నిపుణులు చక్కటి సమాధానాలు ఇస్తున్నారు. ఏయే రకాల నీటిని ఎంతెంత కాలం పాటు నిల్వ చేసి వాడొచ్చనే దానికి శాస్త్రీయ విశ్లేషణ అందిస్తున్నారు. గ్రామ పంచాయితీలు, మునిసిపాలిటీల వంటి స్థానిక సంస్థలు శుద్ధి చేసి నల్లాల ద్వారా పంపిణీ చేసే తాగునీటి వాడకమే మన దేశంలో చాలా ఎక్కువ. ఈ నీటిని దాదాపు 6 నెలల పాటు నిల్వ చేసి తాగొచ్చు. మన దేశంలో ఏటా వర్షాకాలంలో నల్లా పైపుల్లో ఉన్న లీకేజీల కారణంగా, వాటిలోకి మురుగు నీరు చేరుతుంటుంది.
దాన్ని తాగి ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడుతున్న ఘటనలు కూడా కోకొల్లలుగా వెలుగుచూస్తూ ఉంటాయి. ఈనేపథ్యంలో మన దేశంలోని నల్లా నీళ్ల స్వచ్ఛతపై ఎన్నో అనుమానాలు ఉన్నాయి.నల్లా పైపుల్లోని ప్లాస్టిక్ మైక్రో ఫైబర్స్ వల్ల నల్లా నీళ్లు కలుషితం అవుతున్నాయని ఒక అధ్యయనం వెల్లడించింది. దీంతో ఆరోగ్యంగా ఉండేందుకు చాలామంది మినరల్ వాటర్ తాగుతుంటారు. మినరల్ వాటర్ అనేది స్వచ్ఛమైన మంచినీటి సరస్సుల నుంచి అలాగే బావి నుంచి సేకరించబడిన నీరు. ఇందులో సహజసిద్ధమైన మినరల్స్ లభిస్తాయి. మినరల్ వాటర్ ప్లాంట్లలో ఈ నీటిలోకి కార్బన్ డయాక్సయిడ్ ను పంపిస్తారు. అందువల్ల దీన్ని కార్బోనేటెడ్ వాటర్ అని కూడా పిలుస్తారు. దీన్ని గరిష్టంగా ఏడాది నుంచి రెండేళ్ల పాటు నిల్వ చేసుకొని తాగొచ్చు. అయితే నల్లా నీళ్లు, కార్బోనేటెడ్ వాటర్ రెండింటి రుచి కూడా 6 నెలల తర్వాత మారే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ ఈ మార్పును గుర్తిస్తే, వెంటనే తాగడాన్ని ఆపేయాలి. ఇక ప్లాస్టిక్ బాటిళ్లలోని తాగునీటి విషయానికి వస్తే.. బాటిళ్లకు ఉండే ఎక్స్ పరీ తేదీ అత్యంత కీలకం.
ప్రతి ప్లాస్టిక్ బాటిల్ కు దాని నాణ్యత ను బట్టి ఒక నిర్దిష్ట జీవితకాలం ఉంటుంది. ఆ జీవిత కాలం ముగియగానే.. ప్లాస్టిక్ బాటిల్ లోని ప్లాస్టిక్ మన కంటికి కనిపించనంత అతిసూక్ష్మ స్థాయిలో కరగడం మొదలు పెడుతుంది. అలా కరిగే ప్లాస్టిక్ అణువులు.. బాటిల్ లోని నీటిలో కలుస్తాయి. అదే నీటిని మనం గనక తాగితే ప్లాస్టిక్ వ్యర్ధాల ప్రభావంతో వివిధ వ్యాధులు ముసురుకునే పెను ముప్పు ఉంటుంది. ప్లాస్టిక్ కు బదులు.. కాపర్, స్టీల్ బాటిళ్లలో నీటిని నిల్వ చేస్తే ఎక్కువ కాలం సేఫ్ గా ఉంటాయి. నీటిని నిల్వ చేసేందుకు ” బై స్పినల్ ఏ” (BPA) అనే ప్రమాదకర రసాయనం లేని ప్లాస్టిక్ బాటిళ్ల ను, గ్లాస్ బాటిళ్లను వాడినా చాలా సురక్షితం. నల్లా నీళ్లను నిల్వచేసే ట్యాంకులపై మూతను పెట్టాలి. తద్వారా వాటిలోకి దుమ్ము కణాలు, పక్షులు, కోతుల వ్యర్ధాలు చేరకుండా నిరోధించవచ్చు. ఇక మనమంతా ఎక్స్ పరీ ఉన్న నీటినే తాగుదాం. ఆరోగ్య భారతాన్ని నిర్మిద్దాం.
Related News
Equity Shares: కంపెనీ షేర్లను ఉద్యోగులకు బహుమతిగా ఇచ్చిన ప్రముఖ కంపెనీ
దేశంలోని రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ తన ఉద్యోగులకు అనుకోని బహుమతిని అందించింది.