HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Doctors Successfully Separates Brazilian Conjoined Twins

Twins Surgery: మెదళ్లు, తల అతుక్కుని జన్మించిన కవలలు.. ఆపరేషన్‌తో డాక్టర్లు కొత్త చరిత్ర!

ప్రపంచంలో అనేక వింతలు, విశేషాలు చోటుచేసుకుంటూ ఉంటాయి. ఆశ్చర్యపోయే ఘటనలు జరుగుతూ ఉంటాయి.

  • Author : Anshu Date : 02-08-2022 - 9:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Conjoined Twins
Conjoined Twins

ప్రపంచంలో అనేక వింతలు, విశేషాలు చోటుచేసుకుంటూ ఉంటాయి. ఆశ్చర్యపోయే ఘటనలు జరుగుతూ ఉంటాయి. కొంతమంది విచిత్రమైన వ్యక్తులు ఉంటారు. విచిత్రమైన జబ్బులతో బాధపడుతూ ఉంటారు. ఇక కొంతమందికి వంశపార్యపరంగా వ్యాధులు, ఇతర జబ్బులు లాంటి వస్తూ ఉంటాయి. వంశపార్యపరంగా వచ్చే వ్యాధులు జీవితకాలం వేధిస్తూ ఉంటాయి. ఎన్ని చికిత్సలు చేయించుకున్నా.. ఏం వాడినా లాభం ఉండదు.

ఇక ప్రస్తుత కాలంలో కొన్ని కారణాల వల్ల పిల్లలు విచిత్రంగా పుడుతున్నారు. వింత వింత జబ్బులతో జన్మిస్తున్నారు. కవల పిల్లలు పుట్టడం సాధారణమే, కానీ కవలలు అతుక్కుని పుడుతున్నారు. తల, మెదడు అతుక్కుని జన్మిస్తున్నారు. ఇలా పుట్టినప్పుడు వారిని విడదీయడానికి చాలా కష్టతరం అవుతుంది. ఇద్దరినీ విడదీయాలంటే ఆపరేషన్లు చేయాల్సి ఉంటుంది. అయితే విడదీసేటప్పుడు ఏదైనా జరిగితే ఇద్దరి ప్రాణాలకు ముప్పు ఉంటుంది. అందుకే ఇలాంటి కేసుల విషయంలో డాక్టర్లు కూడా రిస్క్ చేయడానికి సిద్దంగా ఉండరు. ఇలాంటి వారిని విడదీయడానికి భయపడుతూ ఉంటారు.

తాజాగా బ్రెజిల్ లో అవిభక్త కవలలు వారి తలలు, మెదళ్లు కలిసిపోయి జన్మించారు. వైద్య బాషలో ఇలా తలలు, మెదళ్లు కలిసిపోయి జన్మించడాన్ని క్రేనియోపాగస్ ట్విన్స్ అంటారు. వీరిని విడదీయడం చాలా కష్టమైన పని. డాక్టర్లు కూడా ముందుకు వచ్చేందుకు భయపడతారు. ఆపరేషన్ ఫెయిల్ అయితే ఇద్దరి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది. దీంతో విడదీయడం చాలా కష్టతరం అని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం టెక్నాలజీ పెరగడం, వైద్యరంగం కూడా డెవలప్ అవ్వడంతో.. డాక్టర్లు ఎలాంటి వాటినైనా సాధించగలుగుతున్నారు.

వైద్యులు శ్రమించి ఈ అవిభక్త కవలను సక్సెస్ పుల్ గా విడదీశారు. ఆపరేషన్ ద్వారా తల, మెదళ్లను విడదీసి విజయవంతం అయ్యారు. వీరికి ఏడు శస్త్రచికిత్సలు చేశారు. చివరి రెండు శస్త్రచికిత్సలకే 33 గంటల సమయం పట్టింది. ఎట్టకేలకు ఆపరేషన్ సక్సెస్ కావడంపై డాక్టర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పిల్లల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆస్పత్రిలో కోలుకుంటున్నారని డాక్టర్లు వివరించారు. ఈ ఆపరేషన్ లో దాదాపు 100 మంది డాక్టర్లు పాల్గొన్నారు. పిల్లలను ఆరు నెలల పాటు అబ్జర్వేషన్ లో ఉంచనున్నారు. రియో డి జెనీరో నగరంలో బ్రెజిల్ వైద్యసంస్ధ అధిపతి గాబ్రియెల్ ముఫార్రెజ్ తో కలిసి డాక్టర్ నూర్, మరో ఇద్దరు సర్జన్లు ఈ ఆపరేషణ్ ను పర్యవేక్షించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Brazil
  • conjoined twins
  • Craniopagus Twins
  • surgery

Related News

Pawan Kalyan heads to Mumbai today; to undergo shoulder surgery.

Pawan Kalyan: నేడు ముంబై కి పవన్ కల్యాణ్.. భుజానికి సర్జరీ

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ ముంబై వెళుతున్నారు. శనివారం ఆయన భుజానికి కోకిలాబెన్‌ ధీరూభాయ్‌ అంబానీ ఆస్పత్రిలో సర్జరీ నిర్వహించనున్నారు. గత నెలాఖరులో ఆయన ముంబైలోని కోకిలాబెన్‌ ధీరూభాయ్‌ అంబానీ ఆస్పత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. పవన్ రెండు భుజాలకు వెంటనే సర్జరీలు చేయాలని డాక్టర్లు సూచించారు. ముందుగా శనివారం రోజు ఒక భుజానికి సర్జరీ చే

    Latest News

    • Harish Rao: బీజేపీతో టచ్‍లో హరీశ్ రావు : రేవంత్ రెడ్డి

    • True Love: ఒక వ్యక్తికి మీ మీద నిజంగా ప్రేమ ఉందో లేదో ఇలా తెలుసుకోవచ్చు!

    • Donald Trump: ముంచుకొస్తున్న డెడ్‌లైన్.. ఇరాన్‎కు ట్రంప్ మాస్ వార్నింగ్

    • Bhagyashri Borse: ఎట్టకేలకు హిట్ కొట్టిన అందాల భామ భాగ్యశ్రీ బోర్సే

    • FSSAI: స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌కు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నోటీసులు..

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd