HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Delhi Advocate Loves Ukraine Girl And Proposed At Airport Goes Viral

Ukraine Girl: ఉక్రెయిన్ అమ్మాయికి ‘ఢిల్లీవాలా’ లవ్ ప్రపోజ్.. త్వరలో పెళ్లి!

ఢిల్లీ వాసి అయిన అనుభవ్ భాసిన్ కు ఉక్రెయిన్ లోని అన్నా హోరోడెట్స్కా మధ్య లవ్ కుదిరింది.

  • Author : Hashtag U Date : 26-03-2022 - 11:33 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ukraine
Ukraine

ప్రేమకు భయం లేదు
ప్రేమకు ధైర్యం ఎక్కువ
ప్రేమ ఎప్పటికీ గెలుస్తుంది
ప్రేమే జీవితం.. ప్రేమే శాశ్వతం..

సరిగ్గా ఇలాంటి అభిప్రాయంతోనే ఉన్నట్టున్నారు ఇద్దరు ప్రేమికులు. అందుకే ఉక్రెయిన్ యుద్ధం కూడా వారి ప్రేమను ఆపలేకపోయింది. సరిహద్దులు దాటి.. భారత్ చేరి మరీ గెలిచింది ఆ ప్రేమ. ఢిల్లీ వాసి అయిన అనుభవ్ భాసిన్ కు ఉక్రెయిన్ లోని అన్నా హోరోడెట్స్కా మధ్య లవ్ కుదిరింది. కానీ వీరి లవ్ స్టోరీలో చాలా ట్విస్టులు ఉన్నాయి. చివరకు యుద్ధం కూడా వీరి లవ్ ని ఏమీ చేయలేకపోయింది. రణరంగం నుంచి బయటకు వచ్చి మన దేశానికి చేరుకుంది అన్నా. అసలు వీరి ప్రేమ కథ ఎలా మొదలైందో తెలుసా?

రెండున్నరేళ్ల కిందటి పరిచయం ఈ ప్రేమికులది. అప్పట్లో ఆమె ఓ ఐటీ కంపెనీలో పనిచేసేది. 2020లో మన దేశానికి వచ్చినప్పుడు లాక్ డౌన్ వల్ల విమానాలు రద్దయ్యాయి. దీంతో వేరే దారిలేక ఇక్కడే ఉండాల్సి వచ్చింది. అప్పుడు అనుభవ్ ఫ్యామిలీతోనే కలిసుంది. అలా లాక్ డౌన్ ముగిసేవరకు వారితోనే ఉంది. తరువాత మళ్లీ దుబాయ్ లో ఓసారి కలుసుకున్నారు. ఒకరి అభిప్రాయాలు ఒకరికి నచ్చడంతో ఇద్దరి మధ్యా ప్రేమ పుట్టింది. అలా ఇద్దరూ ఒకరి దేశానికి మరొకరు రాకపోకలు సాగించారు. కిందటి ఏడాది డిసెంబర్ లో మన దేశానికి వచ్చిన అన్నా.. అనుభవ్ ఫ్యామిలీని మళ్లీ కలిసింది. ఈ జంట అందరికీ నచ్చడంతో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తరువాత ఆమె ఉక్రెయిన్ కు వెళ్లిపోయింది. తరువాత వీరిద్దరూ మళ్లీ కలుసుకునేలోపే యుద్ధం వచ్చింది.

ఉక్రెయిన్ లో బాంబుల వర్షం కురుస్తున్నా సరే.. బాంబ్ షెల్టర్ లో తలదాచుకుని.. అక్కడి నుంచి రైలు మార్గంలో పోలాండ్ కు చేరుకుని అక్కడి నుంచి మనదేశానికి వచ్చింది. ఆమె అలా ఢిల్లీకి చేరేలా అనుభవ్ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. మొత్తానికి తన ప్రాణానికి ప్రాణమైన ప్రేయసిని చూడగానే అతడి ప్రాణం లేచొచ్చింది. అందుకే వెంటనే విమానాశ్రయంలోనే అన్నాకు ప్రపోజ్ చేసేశాడు. ఇది కాస్తా నెట్టింట వైరల్ అయ్యింది. పోలాండ్ లో రాయబార కార్యాలయంలో తీసుకున్న వీసా వల్ల ఆమె ఏడాది పాటు మన దేశంలోనే ఉండొచ్చు. ఈలోపు మన దేశ పౌరసత్వానికి దరఖాస్తు చేస్తానన్నాడు అనుభవ్. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారు. మొత్తానికి ప్రేమకు ఓటమి లేదు… గెలుపు తప్ప అని వీరిద్దరి ప్రేమ మరోసారి లోకానికి చాటిచెప్పినట్టయ్యింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • delhi
  • love story
  • Russia-Ukraine War
  • Ukraine girl
  • viral

Related News

India summons Russia following the death of four Indians in an attack on a merchant vessel off the coast of Ukraine.

Ukraine: ఉక్రెయిన్ తీరంలో వాణిజ్య నౌకపై దాడిలో నలుగురు భారతీయుల మృతి చెందడంతో రష్యాకు భారత్ సమన్లు

రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య కొనసాగుతున్న ఘర్షణల నేపథ్యంలో ఈ దాడి జరిగింది. ఇటీవలి నెలల్లో ఒడెసా సమీపంలోని నల్ల సముద్ర నౌకా మార్గాలపై దాడులు పునరావృతమవుతున్నాయి. ఉక్రెయిన్ తీరంలో ఒక వాణిజ్య నౌకపై క్షిపణి దాడి జరిగి నలుగురు భారతీయులు మరణించిన మరుసటి రోజే, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) న్యూఢిల్లీలోని రష్యా ఛార్జ్ డి అఫైర్స్‌ను పిలిపించింది. గినియా-బిస్సావు జెండా కలిగి

  • Farmers' 'Maha Panchayat' in Delhi today; high tension at the Shambhu border (Haryana-Punjab).

    Farmer Protest: ఢిల్లీలో నేడు రైతుల మహా పంచాయత్‌.. హర్యానా-పంజాబ్ సరిహద్దు శంభు బార్డర్ వద్ద హైటెన్షన్

  • Here are the 4 reasons behind Russia's massive attack on Ukraine.

    Russia Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా అతిపెద్ద దాడికి గల 4 కారణాలు ఇవే

  • ED raids across four states in terror funding and illegal infiltration case.

    ED Raids: ఉగ్రవాద నిధుల ఫండింగ్.. అక్రమ చొరబాటు కేసులో నాలుగు రాష్ట్రాల్లో ఈడీ సోదాలు

Latest News

  • Nara Lokesh: కాకినాడలో NBK111 షూటింగ్‌లో గాయపడిన నందమూరి బాలకృష్ణను మంత్రి నారా లోకేష్ ఫోన్‌లో పరామర్శించార

  • Bahrain: కువైట్, బహ్రెయిన్‌లలోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు

  • Nandamuri Balakrishna: NBK111 షూటింగ్‌లో.. హీరో నందమూరి బాలకృష్ణ కు గాయాలు

  • PM Modi: నీట్ పేప‌ర్ లీక్‌పై తొలిసారి మాట్లాడిన ప్రధాని మోదీ.. బాధ్యులను కఠినంగా శిక్షిస్తాం

  • Tukaram Mundhe: తుకారం ముండే చేపట్టిన కఠిన చర్యలు ఫలిస్తున్నాయా? జలేబీ తన ప్రకాశవంతమైన ఆరెంజ్ కలర్ ను కోల్పోయిందంటూ వైరల్ పోస్ట్.

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd