Bharat Jodo Yatra : ఫుట్ బాల్ ఆడిన రాహుల్…మండిపడుతున్న నెటిజన్లు..!!
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతంగా ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో కొన్ని విమర్శలను కూడా ఎదుర్కొంటోంది.
- Author : hashtagu
Date : 27-09-2022 - 10:39 IST
Published By : Hashtagu Telugu Desk
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతంగా ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో కొన్ని విమర్శలను కూడా ఎదుర్కొంటోంది. తమ పార్టీకి వస్తున్న ఆదరణ చూసి కావాలని కొంతమంది ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రచారాలు చేస్తున్నారని వ్యాఖ్యలు చేస్తోంది కాంగ్రెస్. అయితే ఛాన్స్ దొరికితే చాలు బీజేపీ…భారత్ జోడో యాత్రపై విమర్శలు ఎక్కుపెడుతోంది. తాజాగా రాహుల్ చేసిన పనికి నెటిజన్లు కూడా మండిపడుతున్నారు. రాహుల్ యాత్ర ప్రస్తుతం కేరళలో సాగుతోంది. ప్రజలకు పలకరిస్తూ ముందుకు సాగుతున్నారు రాహుల్. మార్గ మధ్యలో పిల్లలతో కలిసి రాహుల్ కాసేపు ఫుట్ బాల్ ఆడారు. ఆయన బంతిని విసిరి వారిని కాసేపు ఉత్సాహపరిచారు.
అయితే ఈ వీడియోను ట్వీట్టర్ లో షేర్ చేసింది కాంగ్రెస్. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దాలి…ప్రతి అడ్డంకినీ ఎదుర్కొవాలంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. రాజస్థాన్ సంక్షోభ వేళ….రాహుల్ చేసిన ఈ పనికి నెటిజన్లు మండిపడుతున్నారు.
ये भविष्य ही तो संवारना है और इनके लिए हर मुश्किल से टकरा जाना है।#BharatJodoYatra pic.twitter.com/24R5Jvm9gY
— Congress (@INCIndia) September 26, 2022