Coca Cola – Lemon Dou : కోక కోలా నుంచి మద్యం బ్రాండ్ రిలీజ్
Coca Cola - Lemon Dou : కోక కోలా అంటే ఇప్పటిదాకా మనకు కూల్ డ్రింక్స్ మాత్రమే తెలుసు.
- By Pasha Published Date - 03:08 PM, Wed - 13 December 23

Coca Cola – Lemon Dou : కోక కోలా అంటే ఇప్పటిదాకా మనకు కూల్ డ్రింక్స్ మాత్రమే తెలుసు. అయితే ఒక కొత్త అప్ డేట్ వచ్చింది. కోక కోలా కంపెనీ ఒక మద్యం బ్రాండ్‌ను తాజాగా ఇండియా మార్కెట్‌లోకి రిలీజ్ చేసింది. ఆ మద్యం బ్రాండ్ పేరు.. లెమన్- డౌ (Coca Cola – Lemon Dou)!! తొలి విడతలో పైలట్ ప్రాజెక్టుగా ఈ లిక్కర్ బ్రాండ్‌ను గోవా, మహారాష్ట్రలలో కోక కోలా విడుదల చేసింది. అక్కడి కస్టమర్స్ నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ ఆధారంగా దేశమంతా లెమన్ డౌను విడుదల చేసేందుకు కోక కోలా సన్నాహాలు చేస్తోంది. గోవాలో 250 మిల్లీలీటర్ల లెమన్ డౌ ధర రూ.150.. మహారాష్ట్రలో 250 మిల్లీలీటర్ల లెమన్ డౌ ధర రూ.230.
We’re now on WhatsApp. Click to Join.
లెమన్ – డౌ అనేది ఒక రకమైన ఆల్కహాల్ మిక్స్. దీని తయారీ కోసం వోడ్కా, బ్రాండీ వంటి డిస్టిల్డ్ లిక్కర్‌ను వినియోగిస్తారట. లెమన్ – డౌ బ్రాండ్ లిక్కర్‌ను ఇప్పటికే జపాన్, ఫిలిప్పీన్స్, చైనా దేశాల్లో కోక కోలా విక్రయిస్తోంది. ప్రస్తుతానికి దీని తయారీ కూడా విదేశాల్లోని కోక కోలా యూనిట్లలోనే జరుగుతోంది. భవిష్యత్తులో ఇండియా మార్కెట్‌లో దీని సేల్స్ పెరిగితే.. ఇక్కడ కూడా కోక కోలా లిక్కర్ తయారీ యూనిట్లను ఏర్పాటు చేసే అవకాశం ఉంది.