CEO: బీచ్‌లో ఖాళీగా కూర్చోవడం నచ్చక 68 బిలియన్ డాలర్ల కంపెనీకి సీఈవో రాజీనామా?
ప్రస్తుత కాలంలో ఉద్యోగం చేసే వారికంటే నిరుద్యోగులుగా ఉన్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. పెద్ద పెద్ద చదువులు చదివినప్పటికీ అందుకు తగినట్టుగా జాబు లేకపోవడంతో చాలామంది కంపెనీలో చుట్టూ తిరిగి తిరిగి అలసిపోతున్నారు.
- By Anshu Published Date - 06:00 AM, Thu - 30 June 22

ప్రస్తుత కాలంలో ఉద్యోగం చేసే వారికంటే నిరుద్యోగులుగా ఉన్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. పెద్ద పెద్ద చదువులు చదివినప్పటికీ అందుకు తగినట్టుగా జాబు లేకపోవడంతో చాలామంది కంపెనీలో చుట్టూ తిరిగి తిరిగి అలసిపోతున్నారు. ఇంకా చాలామంది అయితే చదివిన చదువుకు తగ్గట్టుగా జాబు లేదన్న మనస్తావంతో చాలామంది ఇప్పటికే ఆత్మహత్యలు కూడా చేసుకున్నాం తెలిసిందే. అయితే చాలామంది ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటూ, జాబ్ కోసం కంపెనీల చుట్టూ తిరుగుతుంటే లండన్ కు చెందిన ఒక వ్యక్తి మాత్రం ఏకంగా సీఈవో జాబ్ కి రాజీనామా చేశాడు.
అయితే అతని సీఈవో జాబ్ మానేయడానికి కారణం తెలిసి అందరూ నోరెళ్లబెడుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..68 బిలియన్ డాలర్ల కంపెనీకి సీఈవో రాజీనామా చేశాడు. లండన్ కు చెందిన జుపిటర్ అండ్ మేనేజ్మెంట్ సంస్థ లో ఆండ్రు ఫార్మిక్ అనే వ్యక్తి 2019లో సీఈవోగా బాధ్యతలను చేపట్టారు. అయితే ఈ 68 బిలియన్ డాలర్ల కంపెనీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఎందుకు రాజీనామా చేస్తున్నాడు కూడా వివరించాడు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేను బీచ్ లో కూర్చుని ఏం చేయాలి అనుకోవడం లేదు.. అలాగే నేను ఇంకేమీ ఆలోచించడం లేదు.. అని అతను తెలిపాడు. 51 ఏళ్ల ఆండ్రూ ఫార్మిక్ అక్టోబరు 1న పదవి నుంచి వైదొలగనున్నారు. అయితే ఆయన జాబ్ మానేయడానికి చెప్పిన కారణం తెలిసి ఆ సంస్థలో పనిచేసిన వారందరూ కూడా ముక్కున వేలేసుకున్నారు.