Viral Video : గోవాలో తప్పిన పెను ప్రమాదం..తెగిపోయిన దూద్ సాగర్ కేబుల్ బ్రిడ్జి..!!
గోవాలో పెను ప్రమాదం తప్పింది. భారీ వర్షాల కారణంగా దూద్ సాగర్ జలపాతం వద్ద కేబుల్ బ్రిడ్జి కూలిపోయింది.
- Author : hashtagu
Date : 15-10-2022 - 8:52 IST
Published By : Hashtagu Telugu Desk
గోవాలో పెను ప్రమాదం తప్పింది. భారీ వర్షాల కారణంగా దూద్ సాగర్ జలపాతం వద్ద కేబుల్ బ్రిడ్జి తెగిపోయింది. 40మందికిపైగా పర్యాటకులను అధికారులు, అక్కడున్న సిబ్బంది రక్షించారు. ఈ ఘటన శుక్రవారం ఈ ఘటన జరిగింది. గోవాలో శుక్రవారం సాయంత్రం భారీ వర్షాలు కురిసాయి. జలపాతం నీటి మట్టం గణనీయంగా పెరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో 40 మందికి పైగా పర్యాటకులు చిక్కుకున్నారు. వారిని దృష్టి లైఫ్‌సేవర్స్ సహాయం ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నీటిమట్టం పెరగడం వల్ల క్రాసింగ్ కోసం ఉపయోగించిన వంతెన కూలిపోయి 40 మందికి పైగా పర్యాటకులు చిక్కుకుపోయారు. దృష్టి లైఫ్‌గార్డుల ద్వారా వెంటనే జలపాతం వద్ద లైఫ్‌సేవర్స్ సహాయం అందించారు. దీంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. భారీ వర్షాలు, నీటిమట్టం పెరగడంతో రానున్న కొద్దిరోజుల పాటు దూద్‌సాగర్ జలపాతంలోకి ఎవరూ వెళ్లకూడదని దృష్టి లైఫ్‌సేవర్స్ హెచ్చరించింది. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
#WATCH गोवा: दूधसागर जलप्रपात में जलस्तर बढ़ने के कारण पुल टूटा। बचाव अभियान चलाकर लोगों को निकाला गया। (14.10)
(वीडियो सौजन्य: DRISHTI PRO) pic.twitter.com/kSi3SHnDLb
— ANI_HindiNews (@AHindinews) October 14, 2022