Cheating : ఆన్లైన్ డేటింగ్ యాప్ ద్వారా మోసపోయిన బ్యాంక్ మేనేజర్.. యువతి కోసం వేగంగా అలాంటి పని చేసి
బ్యాంకు మేనేజర్ హోదాలో ఉన్న ఒక వ్యక్తి ఆన్ లైన్ డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన ఒక యువతి ఉచ్చులో పడి భార్య అక్రమానికి పాల్పడ్డాడు.
- By Nakshatra Published Date - 07:00 AM, Sun - 26 June 22
బ్యాంకు మేనేజర్ హోదాలో ఉన్న ఒక వ్యక్తి ఆన్ లైన్ డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన ఒక యువతి ఉచ్చులో పడి భార్య అక్రమానికి పాల్పడ్డాడు. ఆన్ లైన్ డేటింగ్ ద్వారా పరిచయమైన ఆ యువతి కోసం ఒక కస్టమర్ కాతా నుంచి విధంగా 6 కోట్ల రుణం తీసి ఆ యువతి ఖాతాలో వేసాడు. ఈ విషయం బ్యాంకు అంతర్గత తనిఖీల్లో బయటపడింది. ఇదే విషయం పై ఉన్నతాధికారులు ఫిర్యాదు చేయడం వల్ల బ్యాంకు మేనేజర్ సహా అతడికి సహాయం చేసిన మరో ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. కర్ణాటక బెంగళూరుకు చెందిన హరిశంకర్ ఇండియన్ బ్యాంకు హనుమంతనగర్ శాఖలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు.
నాలుగు నెలల కిందట ఓ డేటింగ్ యాప్‌లో తన పేరు నమోదు చేసుకున్నాడు. ఈ క్రమంలోనే ఓ యువతి అతడికి పరిచయమై రోజూ మెసేజ్ చేస్తూ అతడిని వలలో వేసుకుంది. అలా ఒక రోజు డబ్బులు కావాలంటూ అడగగా రూ.12 లక్షలు ఆమె ఖాతాలో వేశాడు. ఆ తర్వాత మరోసారి డబ్బులు ఇవ్వాలని కోరగా అప్పుడు అతను బ్యాంకులోని అనిత అనే ఖాతాదారురాలి అకౌంట్ ద్వారా దాదాపుగా రూ.6 కోట్లు రుణాన్ని తీసి ఆ యువతి ఖాతాలో వేశాడు. అంతకుముందు అనిత తన ఖాతాలో రూ. 1.3 కోట్లు డిపాజిట్ చేసుకుంది. తాజాగా రుణం కోసం దరఖాస్తు చేసుకునిదానికి సంబంధించిన పత్రాలను సమర్పించింది.
అయితే, హరిశంకర్ వాటిని తారుమారు చేసి రూ.6కోట్లు రుణం మంజూరు చేశాడు. ఆ డబ్బును డేటింగ్ యాప్‌లో పరిచయమైన యువతికి ఇచ్చాడు. మే 13న అనితకు సంబంధించిన ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతా నుంచి రుణం ఇవ్వగా మే 19న అంతర్గతంగా నిర్వహించిన తనిఖీల్లో ఈ విషయం బయటపడింది. జోనల్ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హరిశంకర్ సహా అతడికి సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నేరం చేసినట్లు అంగీకరించాడు. హరిశంకర్‌ను బుధవారం కోర్టులో హజరుపర్చగా 10 రోజుల పోలీస్ కస్టడీ విధించింది.
Related News
Baba Ramdev: బాబా రామ్‌దేవ్ ఎవరి సహాయంతో పతంజలి కంపెనీని ప్రారంభించారో తెలుసా..?
యోగా గురువు బాబా రామ్‌దేవ్ (Baba Ramdev), అతని సంస్థ పతంజలి పేరు నేడు దేశవ్యాప్తంగా మార్మోమోగుతోంది. అయితే ఈ సంస్థ ప్రారంభంలో ఒక జంట ముఖ్యమైన పాత్ర పోషించింది. ఈ జంట పేరు సునీత, సర్వన్ సామ్ పొద్దర్.