Ayodhya Ram Mandir : ‘అయోధ్య రామమందిరం మేకింగ్’.. వీడియో వైరల్
Ayodhya Ram Mandir : అయోధ్యలోని రామమందిరం నిర్మాణ పనులతో కూడిన ఒక వీడియోను శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ ట్విట్టర్ వేదికగా విడుదల చేసింది.
- By Pasha Published Date - 09:30 AM, Fri - 27 October 23

Ayodhya Ram Mandir : అయోధ్యలోని రామమందిరం నిర్మాణ పనులతో కూడిన ఒక వీడియోను శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ ట్విట్టర్ వేదికగా విడుదల చేసింది. ‘500 ఏళ్ల పోరాటానికి ముగింపు’ అనే క్యాప్షన్‌తో ఈ వీడియోను పోస్ట్ చేసింది. 30 సెకెన్ల నిడివి కలిగిన ఈ వీడియోలో రామాలయంలో శిల్పాలకు తుది మెరుగులు దిద్దుతున్న సీన్లు ఉన్నాయి. రామ మందిరం ప్రారంభోత్సవం జనవరి 22న జరగనుంది. దీనికి ముఖ్య అతిథిగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ హాజరుకానున్నారు. ఇప్పటికే ఆయనకు శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ నిర్వాహకులు ఆహ్వాన లేఖను అందజేశారు.
We’re now on WhatsApp. Click to Join.
500 वर्षों के संघर्ष की परिणति pic.twitter.com/z5OTXivUFL
— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) October 26, 2023
జనవరి 14న మకర సంక్రాంతి తర్వాత ఆలయ ప్రతిష్ఠాపన మహోత్సవ కార్యక్రమాలు ప్రారంభించి.. 10 రోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్వహించనున్నారు. మూడంతస్తుల్లో నిర్మిస్తున్న అయోధ్య రామాలయ భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్ పనులు డిసెంబర్ నాటికి పూర్తవుతాయని ఆలయ నిర్మాణ కమిటీ ఛైర్‌పర్సన్ నృపేంద్ర మిశ్రా వెల్లడించారు. 2020 ఆగస్టులో ఆలయ నిర్మాణానికి ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. కాగా, అయోధ్య మందిర ప్రారంభోత్సవ ఆహ్వానం తనకు అందడం పట్ల ప్రధాని మోడీ ఆనందం వ్యక్తం చేశారు. ఆలయ ప్రారంభోత్సవానికి తనకు ఆహ్వానం అందడం గొప్ప ఆశీర్వాదం(Ayodhya Ram Mandir) అన్నారు. తన జీవిత కాలంలో ఈ చారిత్రాత్మక సందర్భాన్ని చూడటం గొప్ప అదృష్టమని చెప్పారు.