Today Horoscope : ఆగస్టు 12 శనివారం రాశి ఫలాలు.. వీరికి ఆకస్మిక గొడవలు, ఆకస్మిక ధనలాభం
Today Horoscope : ఈరోజు మేషరాశి వారు అనవసర భయానికి లోనవుతారు. అకారణ కలహాలు జరిగే సూచనాలు ఉన్నాయి. అనారోగ్య బాధలు అధికమవుతాయి. విద్యార్థులు చంచలంగా ప్రవర్తిస్తారు.
- By Pasha Published Date - 06:59 AM, Sat - 12 August 23
Today Horoscope : మేష రాశి నుంచి మీన రాశి వరకు ఈరోజు రాశి ఫలితాలు ఇవీ..
మేష రాశి
ఈరోజు మేషరాశి వారు అనవసర భయానికి లోనవుతారు. అకారణ కలహాలు జరిగే సూచనాలు ఉన్నాయి. అనారోగ్య బాధలు అధికమవుతాయి. విద్యార్థులు చంచలంగా ప్రవర్తిస్తారు.వ్యాపార రంగంలోని వారు జాగ్రత్తగా ఉండుట మంచిది. ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. కనకధారాస్తవం పఠించాలి.
వృషభ రాశి
ఈరోజు వృషభ రాశి వారు వృథా ప్రయాణాలు చేస్తారు. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకోవలసి వస్తుంది. ఒక మంచి అవకాశాన్ని జారవిడుచుకుంటారు. సన్నిహితులతో విరోధమేర్చడకుండా మెలగుట మంచిది. ఆకస్మిక ధన నష్టం పట్ల జాగ్రత్త అవసరం. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. ఉద్యోగరంగాల్లో నష్టపోయే అవకాశముంది. స్థానచలన సూచనలు ఉన్నాయి. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. శివ అష్టోత్తర శతనామావళి పారాయణ చేయడం మంచిది.
మిథునం
ఈరోజు మిథునరాశి వారికి అప్పులు తొలగుతాయి. నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. శత్రుబాధలుండవు. మీరు చేసే కార్యాలన్నీ వెంటనే ఫలిస్తాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. పిల్లల పట్ల అశ్రద్ధ పనికిరాదు. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. ఆంజనేయ దర్శనం చేయడం మంచిది.
కర్కాటకం
ఈరోజు కర్కాటక రాశి వారు అలర్ట్ గా ఉండాలి. ఆకస్మిక గొడవలకు అవకాశమెక్కువ. ఆకస్మిక ధనలాభంతో ఆనందాన్ని పొందుదురు. మీ కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి. తోటి వారి సహకారంతో అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి. నవగ్రహ ఆలయాలలో శనికి తైలాభిషేకం చేయించి నవగ్రహాలకు ప్రదక్షిణం చేయడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.
సింహం
ఈరోజు సింహరాశి వారికి ప్రతి విషయంలో అభివృద్ధి ఉంటుంది. అన్నింటా విజయాన్నే సాధిస్తారు. రుణ బాధలు తొలగుతాయి. ఆకస్మిక ధనలాభంతో ఆనందాన్ని పొందుదురు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యం మెరువగువుతుంది. వేంకటేశ్వరస్వామిని పూజించడం, వేంకటేశ్వరస్వామి సుప్రభాతం వినడం, చదవడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి.విష్ణు సహస్రనామం పఠించాలి.
Also read : Benefits of Green Chillies: పచ్చిమిర్చి తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే?
కన్య (Today Horoscope)
ఈరోజు కన్యారాశి వారు అనవసర వ్యయప్రయాసల వల్ల ఆందోళన చెందుతారు. వృథా ప్రయాణాలెక్కువగా ఉంటాయి. మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించడం మంచిది. కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. మీరు ఊహించని కార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఆకస్మిక భయం దూరమవుతుంది. విదేశీయాన ప్రయాణాలు ఆలస్యంగా ఫలిస్తాయి. గణపతి ఆరాధన చేస్తే మంచిది.
తుల
ఈరోజు తులారాశి వారికి ఆకస్మిక ధనలాభము ఉంది. నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. రాజకీయ రంగంలోని వారికి, క్రీడాకారులకు అద్భుతమైన అవకాశాలు లభించును. వృత్తి ఉద్యోగరంగాల్లోని వారికి అభివృద్ధి ఉంటుంది. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం సాధిస్తారు. సహనం అన్ని విధాలా శ్రేయస్కరం. కీలక వ్యవహారాల్లో సమాచారలోపం లేకుండా చూసుకోవాలి. ఎవరితోనూ వాదోపవాదాలు చేయరాదు. శివాలయాన్ని దర్శించండి. లింగాష్టకాన్ని పఠించండి.
ఈరోజు వృశ్చిక రాశివారి కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది. బంధు మిత్రులతో వైరమేర్చడకుండా జాగ్రత్త వహించుట మంచిది. రహస్య శత్రుబాధలుండే అవకాశముంది. అనారోగ్య బాధలతో సతమతమవుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండక మానసికాందోళన చెందుతారు. స్థానచలన సూచనలుంటాయి. రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి.లక్ష్మీ సహస్రనామం చదివితే అంతా మంచే జరుగుతుంది.
ధనుస్సు
ఈరోజు ధనుస్సు రాశి వారు ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. నూతన వస్తు, ఆభరణాలను ఖరీదు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ముఖ్యమైన కార్యాలు పూర్తి అవుతాయి. అనవసర వ్యయప్రయాసలు ఉంటాయి. వృధా ప్రయాణాలెక్కువ చేస్తారు. శారీరకంగా బలహీనులవుతారు. సూర్యనారాయణ మూర్తి ఆరాధన శుభదాయకం.
Also read : Refined Flour: మైదాపిండి ఎక్కువగా తింటున్నారా.. అయితే జాగ్రత్త?
మకరం
ఈరోజు మకర రాశి వారికి కుటుంబ విషయాలు సంతృప్తికరంగా ఉండవు. అనుకోకుండా కుటుంబంలో కలహాలేర్చడే అవకాశముంటుంది. కోపాన్ని అదుపులో ఉంచుకొనుట మంచిది. ఏదో ఒక విషయం మిమ్మల్ని మనస్తాపానికి గురిచేస్తుంది. వృధా ప్రయాణాలెక్కువవుతాయి. ధనవ్యయం తప్పదు. నూతన కార్యాలు ఆలస్యంగా ప్రారంభిస్తారు. అబద్దాలాడరాదు. అనారోగ్యంతో బాధపడతారు. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.
కుంభం
ఈరోజు కుంభ రాశి వారు అపకీర్తి రాకుండా జాగ్రత్తపడుట మంచిది. సోదరులతో వైరమేర్పడకుండా మెలగాలి. బంధుమిత్రులతో గొడవలకు దూరంగా ఉండండి. నూతన వ్యక్తుల జోలికి వెళ్ళరాదు. తలచిన కార్యాలకు ఆటంకాలెదురవుతాయి. మంచి అవకాశాలను కోల్పోతారు. కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేసుకుంటారు. సోమరితనం ఆవహిస్తుంది. ఆర్ధిక పరిస్థితులలో మార్పులు ఉండవు. శివాలయాన్ని దర్శించండి. విష్ణు సహస్రనామాలు చదివితే మంచి జరుగుతుంది.
మీనం
ఈరోజు మీన రాశి వారు శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభముంటుంది. నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. శుభకార్య ప్రయతాలు ఫలిస్తాయి. రుణ బాధలు తొలగిపోతాయి. శత్రు బాధలుండవు. శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పఠించడం మంచిది.
గమనిక: ఈ కథనంలో ఉన్న సమాచారం జ్యోతిష్యులు/ పంచాంగాలు/ ఉపన్యాసాలు/నమ్మకాలు/గ్రంధాల నుండి సేకరించిన తర్వాత మీ ముందుకు తీసుకురాబడింది. మా లక్ష్యం సమాచారాన్ని అందించడం మాత్రమే, దాని వినియోగదారులు దానిని కేవలం సమాచారంగా తీసుకోవాలి. అదనంగా, దాని యొక్క ఏదైనా ఉపయోగం వినియోగదారు యొక్క పూర్తి బాధ్యత.
Related News
Earth Hour 2024: శనివారం హైదరాబాద్ లో గంటపాటు ఎర్త్ అవర్
ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ప్రజలు సంవత్సరానికి ఒక రోజు ఎర్త్ అవర్ పాటిస్తారు. దీన్ని మొదట ఆస్ట్రేలియాలో మొదలు పెట్టారు. 2007లో ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఎర్త్ అవర్ కార్యక్రమం మొదలైంది