KL Rahul: జర్మనీలో రాహుల్ వెంట అతియా శెట్టి
గాయం కారణంగా ఇంగ్లాండ్ టూర్ కు దూరమైన టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ ప్రస్తుతం జర్మనీలో చికిత్స తీసుకుంటున్నాడు.
- By Naresh Kumar Published Date - 01:00 PM, Sun - 26 June 22
గాయం కారణంగా ఇంగ్లాండ్ టూర్ కు దూరమైన టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ ప్రస్తుతం జర్మనీలో చికిత్స తీసుకుంటున్నాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో బీసీసీఐ అతన్ని జర్మనీకు పంపించింది. వీలైనంత త్వరగా రాహుల్ కోలుకోవాలని టీమ్ మేనేజ్ మెంట్ కూడా భావిస్తోంది. ఇదిలా ఉంటే జర్మనీలో రాహుల్ కు తోడుగా అతని ప్రియురాలు అతియా శెట్టి ప్రత్యక్షమయింది.
దగ్గరుండి రాహుల్ బాగోగులను చూసుకుంటోంది. బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కుమార్తె అయిన అతియాతో కే ఎల్ రాహుల్ చాలా కాలంగా ప్రేమలో ఉన్నాడు. అధికారికంగా తమ లవ్ గురించి చెప్పకున్నా చెట్టా పట్టాలేసుకుని తిరుగుతున్నారు.వీరి పెళ్లి డిసెంబర్ లో ఉంటుందన్న వార్తలు వస్తున్నాయి.
పెళ్లి తర్వాత ఇద్దరూ కలిసి ఉండేందుకు ముంబైలోని బ్రాండ్ న్యూ హోమ్ లో ఒక ఇంటిని కూడా కొనుగోలు చేసినట్లు వార్తలు సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొట్టాయి. పలు సందర్భాల్లో లవ్ ఎఫైర్ వార్తలని అతీయా కొట్టిపారేసినా చాలా సార్లు నైట్ పార్టీలు , వెకేషన్ లలో ఈ జంట కలిసి కనిపిస్తూనే ఉంది. తాజాగా జర్మనీ లో మరోసారి రాహుల్ వెంట అతియ కనిపించడంతో వీరిద్దరూ పెళ్లి చేసుకోవడమే మిగిలిందని నెటిజన్లు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే రాహుల్ గాయాల కారణంగా సిరీస్ లను తప్పుకోవడం ఇదేం కొత్తకాదు. గతంలో కండరాల నొప్పితో న్యూజిలాండ్, వెస్టిండీస్, శ్రీలంకతో టెస్టు, టీ20 వంటి సిరీస్‌లకు దూరం అయ్యాడు. మణికట్టు గాయంతో ఆస్ట్రేలియాతో సిరీస్ నుంచి తప్పుకున్నాడు. ఇంగ్లాండ్, ఐర్లాండ్ సిరీస్ ల తర్వాత భారత్ వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. వెస్టిండీస్ తో సిరీస్‌కైనా రాహుల్ అందుబాటులోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.
Related News
LSG Beats CSK: చెన్నైకు షాకిచ్చిన లక్నో.. 8 వికెట్ల తేడాతో ఘన విజయం
చెన్నై సూపర్ కింగ్స్‌పై లక్నో సూపర్ జెయింట్స్ (LSG Beats CSK) ఏకపక్షంగా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట ఆడిన CSK 57 పరుగులతో రవీంద్ర జడేజా అర్ధ సెంచరీ ఇన్నింగ్స్‌తో 176 పరుగులు చేసింది.