Rupert Murdoch : 9 పదుల వయసులో.. 4వసారి విడాకులు తీసుకోబోతున్న మీడియా దిగ్గజం!!
ఆయన వయసు 91 ఏళ్ళు.. అయితేనేం నాలుగోసారి విడాకులు తీసుకునేందుకు సిద్ధం అవుతున్నారు.
- By Hashtag U Published Date - 09:00 AM, Sat - 25 June 22
ఆయన వయసు 91 ఏళ్ళు.. అయితేనేం నాలుగోసారి విడాకులు తీసుకునేందుకు సిద్ధం అవుతున్నారు. దీనిపై ఇప్పుడు సర్వత్రా హాట్ డిబేట్ జరుగుతోంది. ఆయన మరెవరో కాదు..అపర కుబేరుడు, మీడియా దిగ్గజం రూపర్ట్ ముర్డోక్. తన భార్య 65 ఏళ్ల జెర్రీ హాల్ తో మర్డోక్ విడాకులు తీసుకుంటున్నట్లు న్యూయార్క్ టైమ్స్ లో కథనం ప్రచురితం అయింది. ఆరేళ్ల క్రితమే (2016లో) వీరి పెళ్లి జరిగింది. 2016లో ముర్డోక్.. ‘బ్యాట్‌మాన్’, ‘ది గ్రాడ్యుయేట్’ వంటి హాలీవుడ్ చిత్రాల్లో నటించిన జెర్రీ హాల్‌ను వివాహం చేసుకున్నాడు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. జెర్రీ హాల్, ముర్డోక్ ను వివాహం చేసుకోకముందు మిక్ జాగర్ అనే వ్యక్తిని పెళ్లాడింది. ఆమెకు నలుగురు పిల్లలు ఉన్నారు. ఇక, ముర్డోక్ మొదటి వివాహం 1956లో ఆస్ట్రేలియన్ ఫ్లైట్ అటెండెంట్ ప్యాట్రిసియా బుకర్‌తో జరిగింది. 1967లో ఆమెకు ముర్డోక్ విడాకులు ఇచ్చాడు. ముర్డోక్ రెండో భార్య పేరు .. అన్నా మారియా టోర్. 1967 నుంచి 1999 వరకు వీరి వివాహ జీవితం కొనసాగింది. మూడో భార్య పేరు డెంగ్. ఈమెతో ముర్డోక్ వివాహ జీవితం 1999 నుంచి 2013 వరకు కొనసాగింది. మూడేళ్ళు గ్యాప్ ఇచ్చి నాలుగో పెళ్లి చేసుకున్నాడు ముర్డోక్.జెర్రీ హాల్, రూపర్ట్ ముర్డోక్‌లకు వేర్వేరు వివాహాల నుంచి 10 మంది పిల్లలు ఉన్నారు. ఫాక్స్ న్యూస్ ఛానల్, న్యూస్ కార్ప్, వాల్ స్ట్రీట్ జర్నల్ ఇవన్నీ మర్డోక్ కు చెందిన వార్తా సంస్థలు. న్యూస్ కార్ప్, ఫాక్స్ కార్ప్ లో కుటుంబ ట్రస్ట్ ద్వారా మర్డోక్ 40 శాతం వాటా కలిగి ఉన్నారు. ఫోర్బ్స్ అంచనా ప్రకారం మర్డోక్ నెట్ వర్క్ విలువ 17.7 బిలియన్ డాలర్లు. మన కరెన్సీలో ఇది సుమారు రూ.1.80 లక్షల కోట్లు.
Related News
Fifth Marriage : మర్దోక్ పెళ్లికొడుకాయెనె.. 93 ఏళ్ల ఏజ్‌లో ఐదో పెళ్లి.. ఎవరితో ?
Fifth Marriage : రూపర్ట్ మర్దోక్.. అపర కుబేరుడు. ఆయనకు దాదాపు రూ.లక్ష కోట్ల ఆస్తులున్నాయి.