Asteroid Samples : ఆస్టరాయిడ్ శాంపిల్స్ భూమికి వచ్చేశాయ్.. ఎలా ? ఎందుకు ?
Asteroid Samples : అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) మరో ముందడుగు వేసింది.
- By Pasha Published Date - 06:05 AM, Mon - 25 September 23
Asteroid Samples : అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) మరో ముందడుగు వేసింది. భూమి పుట్టుక, జీవం గురించిన గుట్టు విప్పే దిశగా 2016లో ప్రయోగించిన ‘ఒసిరిస్ రెక్స్’ స్పేస్‌క్రాఫ్ట్ .. ‘బెన్నూ’ అనే గ్రహశకలం నుంచి దుమ్ము, రాళ్ల శాంపిళ్లను సేకరించింది. వాటిని ఒక క్యాప్సూల్ ద్వారా సురక్షితంగా భూమికి పంపించింది. భూమి నుంచి లక్ష కిలోమీటర్ల దూరం నుంచి ‘ఒసిరిస్ రెక్స్’ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా విడుదలైన ఈ క్యాప్సూల్ అమెరికాలోని ఉతా ఎడారిలో దిగింది.
Only minutes away from landing! The #OSIRISREx main parachute has deployed at about 5,050 feet (1540m) to slow down the speed of the sample capsule. pic.twitter.com/2XzvRMKshz
— NASA (@NASA) September 24, 2023
వాస్తవానికి 2016లో భూమి నుంచి ప్రయాణం మొదలుపెట్టిన ‘ఒసిరిస్ రెక్స్’ స్పేస్‌క్రాఫ్ట్ 2020 అక్టోబరులోనే బెన్నూ గ్రహశకలం వద్దకు చేరుకుంది. ఆ గ్రహశకలం ఉపరితలంపై డ్రిల్ చేసి మట్టి, రాళ్ల శాంపిళ్లను సేకరించింది. మళ్లీ 2021 మే 10న భూమి దిశగా ‘ఒసిరిస్ రెక్స్’ స్పేస్‌క్రాఫ్ట్ తిరుగు ప్రయాణం మొదలుపెట్టింది. ఎట్టకేలకు ఆ స్పేస్ క్రాఫ్ట్ భూమికి లక్ష కిలోమీటర్ల దూరం నుంచి ఒక క్యాప్సూల్ ద్వారా బెన్నూ గ్రహశకలం శాంపిల్స్ ను (Asteroid Samples) జారవిడిచింది. అది పారచూట్ ద్వారా అమెరికాలోని ఉతా ఎడారిలో ల్యాండ్ అయింది. క్యాప్సూల్ ల్యాండింగ్ దృశ్యాలను నాసా రికార్డు చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also read : Telangana : తెలంగాణలో బీజేపీకి షాక్.. బీఆర్ఎస్లో చేరిన తొమ్మిది మంది నిజామాబాద్ నేతలు
After a journey of nearly 3.9 billion miles, the #OSIRISREx asteroid sample return capsule is back on Earth. Teams perform the initial safety assessment—the first persons to come into contact with this hardware since it was on the other side of the solar system. pic.twitter.com/KVDWiovago
— NASA (@NASA) September 24, 2023
వాస్తవానికి నాసా ఒక భారీ ఆస్టరాయిడ్ ను 1999 సెప్టెంబర్ 11న తొలిసారి గుర్తించింది. దానికి బెన్నూ అని పేరు పెట్టింది. దీని విస్తీర్ణం దాదాపు 565 మీటర్లు. సెకనుకు 28 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంటుంది. ఈజిప్ట్ మైథాలజీలో ఉన్న బెన్నూ అనే పక్షి పేరును ఈ ఆస్టరాయిడ్కు పెట్టారు. ఈ గ్రహశకలం 450 కోట్ల సంవత్సరాల పురాతనమైనదని నాసా అంచనా వేస్తోంది. దాదాపుగా 2,182 సంవత్సరం సెప్టెంబర్‌లోనే ఈ ఆస్టరాయిడ్ భూమిని ఢీకొట్టే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. ఈ క్రమంలోనే దానిపై దృష్టిసారించిన నాసా.. సమగ్ర స్టడీ చేస్తోంది.
Related News
NASA : నాసా అవార్డులను గెలుచుకున్న భారతీయ విదార్థులు
NASA: అహ్యూమన్ ఎక్స్‌ప్లోరేషన్ రోవర్ ఛాలెంజ్ కోసం ఢిల్లీ మరియు ముంబైకి చెందిన భారతీయ విద్యార్థుల(Indian students) బృందాలు నాసా(NASA)నుండి అవార్డులను గెలుచుకున్నాయి. అలబామా రాష్ట్రంలోని హంట్స్ విల్లేలో ఉన్న అమెరికా అంతరిక్ష రాకెట్ కేంద్రంలో ఈ నెల 19, 20 తేదీల్లో ఈ పోటీలు జరిగాయి. We’re now on WhatsApp. Click to Join. ఢిల్లీకి చెందిన కేఐఈటీ గ్రూప్ విద్యాసంస్థకు చెందిన స్టూడెంట్స్ క్రాష్ అండ్ బర్న్ విభాగంలో అ�