AP Polycet 2023 Results : పాలీసెట్ రిజల్ట్స్ రిలీజ్.. ఇలా చెక్ చేస్కోండి
ఆంధ్రప్రదేశ్ పాలిసెట్ ఫలితాలు (AP Polycet 2023 Results) శనివారం ఉదయం 10.45 నిమిషాలకు రిలీజ్ అయ్యాయి.
- Author : Pasha
Date : 20-05-2023 - 11:34 IST
Published By : Hashtagu Telugu Desk
ఆంధ్రప్రదేశ్ పాలిసెట్ ఫలితాలు (AP Polycet 2023 Results) శనివారం ఉదయం 10.45 నిమిషాలకు రిలీజ్ అయ్యాయి. విజయవాడలో విద్యాశాఖ అధికారులు రిజల్ట్స్ ను ప్రకటించారు. పాలిటెక్నిక్ ఎంట్రన్స్ కు 1,43,592 మంది హాజరయ్యారు. వీరిలో బాలికలు 55,562 మంది, బాలురు 88,030 మంది ఉన్నారు. 87 ప్రభుత్వ, 171 ప్రైయివేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో 29 బ్రాంచ్‌లలో మూడేళ్ల డిప్లొమా కోర్సులో ప్రవేశాలకు ఈ పరీక్షను నిర్వహించారు. ఈ కాలేజీల్లోని 29 విభాగాల్లో 70వేల 569 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ విద్యా సంవత్సరం నుంచి నూతనముగా ప్రారంభిస్తున్న నంద్యాల జిల్లా- బేతంచెర్ల, కడప జిల్లా-మైదుకూరు, అనంతపురం జిల్లా – గుంతకల్లులో ప్రభుత్వ పాలిటెక్నిక్ లలో ప్రవేశాలు పొందే అవకాశం ఉంటుంది. పరీక్షకు హాజరైన విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ https://polycetap.nic.in లోకి వెళ్లి ఫలితాలను(AP Polycet 2023 Results) చెక్ చేసుకోవచ్చు.
ఇలా చెక్ చేసుకోండి..
- తొలుత https://polycetap.nic.in సైట్ లోకి వెళ్లాలి.
- పాలీ సెట్ రిజల్ట్స్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి.
- సబ్మిట్ బట్ నొక్కిన తర్వాత మీ ర్యాంక్ కార్డు డిస్ ప్లే అవుతుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి ర్యాంక్ కార్డు పొందొచ్చు.
- అడ్మిషన్ ప్రక్రియలో ర్యాంక్ కార్డు అత్యంక కీలకం.
రిజల్ట్ లింక్ ఇదే: https://polycetap.nic.in