Viral Song: ‘హర్ హర్ శంభు’ గాయని అభిలిప్సా పాండే నుంచి మరో సాంగ్ వైరల్..!!
'హర్ హర్ శంభు' పాట విషయంలో గతంలో పెద్ద వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ఇండియన్ ఐడల్ ఫర్మానీ నాజ్, అభిలిప్సా పాండా ఈ పాటతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.
- By hashtagu Published Date - 04:38 PM, Mon - 26 September 22

‘హర్ హర్ శంభు’ పాట విషయంలో గతంలో పెద్ద వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ఇండియన్ ఐడల్ ఫర్మానీ నాజ్, అభిలిప్సా పాండా ఈ పాటతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఇప్పుడు అభిలిప్సా దేవి… దేవి నవరాత్రుల సందర్భంగా పాడిన మరో సాంగ్ ఇప్పుడు ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. నవరాత్రి ప్రత్యేక సందర్భంలో విడుదల చేసిన ఈ పాటలో అభిలిప్సా అమ్మవారి భక్తిలో లీనమై కనపించింది. నవ్ దుర్గా నమో నమ: అనే పాట ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ఈ పాటకు ఇప్పటివరకు 1.4k కంటే ఎక్కువ లైక్స్ వచ్చాయి. అభిలిప్సా పాండాది ఒరిస్సా. ప్రస్తుతం ఆమె 12వ తరగతి చదువుతోంది. ‘హర్ హర్ శంభు’ హిందీతోపాటు తెలుగులో కూడా పాడారు.
Video Courtesy: @BhaktiDarshan Youtube Channel