Aliens and Humans: మనుషులు, ఏలియన్స్ మధ్య యుద్ధం.. ఓ టైమ్ ట్రావెలర్ సంచలనం!
గ్రహాంతరవాసులకు , మానవులకు మధ్య యుద్ధం జరుగుతుందట.
- By Hashtag U Updated On - 05:23 PM, Mon - 23 January 23

2023 సంవత్సరంలో గ్రహాంతరవాసులకు , మానవులకు మధ్య యుద్ధం జరుగుతుందట.. దానికి సంబంధించిన డేట్ కూడా ఫిక్స్ అయ్యిందట. ఈవిషయాలన్నీ తనను తాను రియల్ టైమ్ ట్రావెలర్ గా క్లెయిమ్ చేసుకుంటున్న ఒక వ్యక్తి టిక్‌టాక్ వేదికగా చెప్పాడు. టిక్‌టాక్‌లో తన ప్రొఫైల్‌కు రియల్ టైమ్‌ట్రావెలర్ అని పేరు పెట్టాడు. అతను 2869 సంవత్సరానికి చెందినవాడని అందులో ప్రస్తావించాడు. 2023 సంవత్సరంలో జరగబోయే ప్రధాన సంఘటనల గురించి ఇలా వివరించాడు. అతడి కథనం ప్రకారం..
” 2023లో గ్రహాంతరవాసులతో మనుషులకు యుద్ధం జరుగుతుంది. నేను రాబోయే 846 సంవత్సరాల టైం నుంచి తిరిగి వచ్చాను. అంటే 2869 సంవత్సరం నుంచి… నేను రియల్ టైమ్ ట్రావెలర్ ను. ఈ ఏడాది భయంకరమైన భూకంపాలు వస్తాయి. సముద్రంలో చారిత్రక ఆవిష్కరణలు జరుగుతాయి. ఈ ఏడాది అమెరికాకు పెద్ద విపత్తు వస్తుంది. దానికి సంబంధించిన తేదీల జాబితా కూడా రెడీగా ఉంది. మార్చి 18, 2023న అలస్కాలోని విస్లార్‌లో 8.1 తీవ్రతతో భూకంపం సంభవించనుంది. భయంకరమైన విపత్తు ఉంటుంది. 26 జూన్ 2023న పసిఫిక్ మహాసముద్రంలో నీలి తిమింగలం కంటే పెద్ద జీవి కనుగొనబడుతుంది.
ఇది 350 అడుగుల పొడవు ఉంటుంది. అక్టోబర్ 01, 2023న గోలోత్ అనే జాతి కనిపిస్తుంది. ఇది మానవుల కంటే చాలా తెలివైనది. వీటి తర్వాత మాత్రమే గ్రహాంతరవాసులు, మానవుల మధ్య అంతరిక్ష యుద్ధం ప్రారంభమవుతుంది. గ్రహాంతరవాసులు భూమివైపు వస్తున్నారని టైమ్ ట్రావెలర్ చెప్పాడు. ఈ టిక్‌టాక్ క్లిప్ ఇప్పుడు వైరల్ అవుతోంది.దీనిపై నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేశారు. “నేను 2021 సంవత్సరం నుండి చూస్తున్నాను . 2023 చాలా బాగా ఉంటుంది” అని ఒకరు కామెంట్ పెట్టారు . ఈ రహస్యమైన టిక్‌టాకర్ వాదనలన్నీ కల్పితాలే అని పేర్కొన్నారు.

Related News

Aishwarya Rai with Salman: ఐశ్వర్య – సల్మాన్ ‘కుచ్ కుచ్ హోతా హై’.. ఓల్డ్ పిక్ వైరల్!
సల్మాన్ ఖాన్, ఐశ్వర్య రాయ్ కు సంబంధించిన పాత ఫోటో (Old Pic) సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.