Viral Video: సైకిల్ పై 9 మంది ప్రయాణం.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో
ప్రపంచ జనాభా 2030లో 8.5 బిలియన్లు.ప్రస్తుతం 1.39 బిలియన్ల కంటే ఎక్కువ జనాభా ఉన్న భారతదేశ జనాభా 2023లో చైనాను అధిగమించి
- By Balu J Published Date - 04:48 PM, Thu - 17 November 22

ప్రపంచ జనాభా 2030లో 8.5 బిలియన్లు.ప్రస్తుతం 1.39 బిలియన్ల కంటే ఎక్కువ జనాభా ఉన్న భారతదేశ జనాభా 2023లో చైనాను అధిగమించి పెరుగుతుందని అంచనా. ఆఫ్రికా కంట్రీలోనూ జనాభా పెరుగుతోంది. ఈ పెరుగుదల పేదల దుర్భర స్థితికి అద్దం పడుతోంది. ఈ ఘటనను అందుకు ఉదాహరణగా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి ఎనిమిది పిల్లలను సైకిల్ పై తీసుకెళ్తున్న ఫొటో ఒకటి వైరల్ గా మారింది.
వీడియోలో సైకిల్ వెనుక భాగంలో ముగ్గురు, ముందు భాగంలో మరో ముగ్గురు, సీటుపై మరో ఇద్దరిని ఆ వ్యక్తి తీసుకెళ్లడం చూడొచ్చు. వ్యక్తి సైకిల్ తొక్కుతున్నప్పుడు ముందు, వెనుక ఉన్న పిల్లలు సైకిల్ హ్యాండిల్, సీటుతోపాటు ఆ వ్యక్తిని గట్టిగా పట్టుకోవడం చూడొచ్చు. ఈ వీడియో 191k పైగా వ్యూస్ సాధించి వైరల్ గా మారింది. చాలా మంది పిల్లలతో సైకిల్ తొక్కుతున్న వ్యక్తిని చూసి నెటిజన్లు షాక్ అయ్యారు. ఇది చాలా డేంజరస్. ఇంత మంది పిల్లలను సైకిల్ మీద తీసుకెళ్తారా అంటూ కామెంట్స్ చేశారు.
https://twitter.com/JaikyYadav16/status/1592438950991626241?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1592438950991626241%7Ctwgr%5E5c5b718bc56cb65c88311af5521438f35fe18423%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.india.com%2Fviral%2Fviral-video-man-rides-bicycle-with-his-9-kids-population-8-billion-5747984%2F