Viral Video : కుప్పకూలిన ఫుట్ పాత్ ఏం జరిగిందో చూస్తే షాకే..!!
ప్రతి ఒక్కరి జీవితంలో అనుకోని సంఘటనలు సర్వసాధారణం. ఇలాంటి సంఘటనలు కొన్నిసార్లు భయాన్ని కలిగిస్తాయి. అలాగే, కొన్నిసార్లు కొందరు కొన్ని సెకన్లలో ప్రమాదం నుండి తప్పించుకుంటారు. మీలో చాలా మందికి కనీసం ఒక్కసారైనా ఈ అనుభవం ఎదురై ఉంటుంది.
- Author : hashtagu
Date : 06-08-2022 - 12:58 IST
Published By : Hashtagu Telugu Desk
ప్రతి ఒక్కరి జీవితంలో అనుకోని సంఘటనలు సర్వసాధారణం. ఇలాంటి సంఘటనలు కొన్నిసార్లు భయాన్ని కలిగిస్తాయి. అలాగే, కొన్నిసార్లు కొందరు కొన్ని సెకన్లలో ప్రమాదం నుండి తప్పించుకుంటారు. మీలో చాలా మందికి కనీసం ఒక్కసారైనా ఈ అనుభవం ఎదురై ఉంటుంది. మీరు సోషల్ మీడియాలో కూడా ఇలాంటి దృశ్యాలు చాలానే చూసి ఉండవచ్చు. అయితే ఈ సీన్ హర్రర్ క్రియేట్ చేసిన వెంటనే ఓ ఫీలింగ్ కూడా వస్తుంది.
When Yamraj is on lunch break pic.twitter.com/zN63aFCerA
— Sagar (@sagarcasm) August 3, 2022
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాల్లో చక్కర్లు కొడుతోంది. రహదారి పక్కన ఉన్న ఫుట్‌పాత్ నుండి నడుస్తున్న ఓ వ్యక్తికి ఊహించని సంఘటన ఎదురైంది. ఆ వ్యక్తి దాటగానే ఫుట్ పాత్ కూలిపోయింది…! అతని అదృష్టం బాగుండి.. క్షేమంగా బయటపడ్డాడు. CC కెమెరాల్లో ఈ సీన్ రికార్డు అయ్యింది. ఈ వీడియో ఇప్పుడు నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ఈ సీన్ చూసిన చాలా మంది షాక్ అయ్యారు. పలువురు కామెంట్లు కూడా చేస్తున్నారు.