Currency Note Press : ఐటీఐ పాసయ్యారా ? కరెన్సీ నోట్ ప్రెస్‌లో జాబ్స్
Currency Note Press : ఐటీఐ పాసయ్యారా ? ఫైన్ ఆర్ట్స్/ విజువల్ ఆర్ట్స్ విభాగాల్లో బ్యాచులర్ డిగ్రీ చేశారా ?
- By Pasha Published Date - 11:39 AM, Tue - 24 October 23
Currency Note Press : ఐటీఐ పాసయ్యారా ? ఫైన్ ఆర్ట్స్/ విజువల్ ఆర్ట్స్ విభాగాల్లో బ్యాచులర్ డిగ్రీ చేశారా ? గ్రాఫిక్స్‌లో వొకేషనల్ డిగ్రీ ఉందా ? అయితే మంచి ఉద్యోగ అవకాశం ఇది. మహారాష్ట్రలోని నాసిక్‌లో ఉన్న కరెన్సీ నోట్ ప్రెస్ (సీఎన్పీ)లో 117 జాబ్స్ భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీని ద్వారా 112 జూనియర్ టెక్నీషియన్, 2 సూపర్వైజర్ (టీఓ ప్రింటింగ్), 1 సూపర్వైజర్ (అఫీషియల్ లాంగ్వేజ్), 1 ఆర్టిస్ట్ (గ్రాఫిక్ డిజైనర్), 1 సెక్రటేరియల్ అసిస్టెంట్ పోస్టును భర్తీ చేయనున్నారు. ఐటీఐ పాస్ అయినవారు జూనియర్ టెక్నీషియన్ పోస్టులకు అర్హులు. అయితే ఐటీఐలోని ఎలక్ట్రికల్/ మెషినిస్ట్/ ఫిట్టర్/ ఎలక్ట్రానిక్స్/ ఎయిర్ కండిషనింగ్/ ప్రింటింగ్ ట్రేడ్ విభాగాల్లో క్వాలిఫై అయి ఉండాలి. ఆర్టిస్ట్ పోస్టులకు ఫైన్ ఆర్ట్స్/ విజువల్ ఆర్ట్స్ విభాగాల్లో బ్యాచులర్ డిగ్రీ చేసి ఉండాలి. గ్రాఫిక్స్‌లో వొకేషనల్ డిగ్రీ చేసిన వాళ్లు కూడా అప్లై చేయొచ్చు. సూపర్వైజర్ పోస్టులకు అప్లై చేసేవారి వయస్సు 30 ఏళ్లలోపు ఉండాలి. ఆర్టిస్ట్, సెక్రటేరియల్ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేసే వారి వయస్సు 28 ఏళ్లలోపు ఉండాలి.టెక్నీషియన్ పోస్టులకు అప్లై చేసేవారి వయస్సు 25 ఏళ్లలోపు(Currency Note Press)ఉండాలి.
We’re now on WhatsApp. Click to Join.
ఆసక్తి గల అభ్యర్థులు https://cnpnashik.spmcil.com/en/ అనే వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చు. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ నవంబరు 18. అభ్యర్థులకు ఆన్లైన్ పరీక్ష నిర్వహిస్తారు. అందులో ఉత్తీర్ణులైన వారిని జాబ్‌కు ఎంపిక చేస్తారు. అయితే సెక్రటేరియల్ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేసిన వారికి స్టెనోగ్రఫీ/టైపింగ్ టెస్ట్ ఉంటుంది. 2024 జనవరి లేదా ఫిబ్రవరిలో పరీక్ష నిర్వహిస్తారు. సూపర్వైజర్లకు నెలకు రూ.27,600 నుంచి రూ.95,910 వరకు, ఆర్టిస్ట్, సెక్రటేరియల్ అసిస్టెంట్లకు నెలకు రూ.23,910 నుంచి 65,570 వరకు, జూనియర్ టెక్నీషియన్లకు నెలకు రూ.18,780 నుంచి రూ.67,390 వరకు జీతం ఉంటుంది.
Also Read: MLC Kavitha: కవితకు ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ఆహ్వానం, తెలంగాణ స్థితిగతులపై కీలకోపన్యాసం
Related News
Udyogini Scheme : వడ్డీ లేకుండా 3 లక్షల లోన్.. సగం మాఫీ.. ఎలా ?
Udyogini Scheme : ఒకటి కాదు.. పది కాదు.. 88 రకాల వ్యాపారాలు చేసుకునే మహిళలకు గొప్ప అవకాశం.