Telangana: మహిళ రిజర్వేషన్లపై కవితకు షర్మిల లేఖ
ఎమ్మెల్సీ కవిత, వైఎస్ఆర్టీపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. వీరిద్దరి మధ్య మహిళల రిజర్వేషన్లపై ప్రధాన చర్చ కొనసాగుతుంది
- By Praveen Aluthuru Published Date - 06:36 PM, Wed - 6 September 23

Telangana: ఎమ్మెల్సీ కవిత, వైఎస్ఆర్టీపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. వీరిద్దరి మధ్య మహిళల రిజర్వేషన్లపై ప్రధాన చర్చ కొనసాగుతుంది. తాజాగా ఎమ్మెల్సీ కవిత వైఎస్ షర్మిలకు లేఖ పంపారు. దానికి షర్మిల స్పందిస్తూ.. ఎమ్మెల్సీ కవిత నుంచి లేఖ వచ్చిందని, భారత పార్లమెంటు మరియు రాష్ట్రాల అసెంబ్లీలలో మహిళలకు 33% రిజర్వేషన్లు సాధించేందుకు ఆమె చేపట్టిన కార్యక్రమాలకు నా మద్దతు కోరుతున్నాను అని పేర్కొన్నది. బీఆర్ఎస్ పార్టీలో మహిళ అభ్యర్థుల వాటాను పెంచడానికి మరియు యావత్ దేశానికి ఆదర్శంగా నిలవడానికి ముందుగా మీ తండ్రిని ఆకట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ ఇటీవల ప్రకటించిన అభ్యర్థుల జాబితాను కూడా కవితకు పంపుతున్నాను, అందులో మహిళల శాతాన్ని లెక్కించవలసిందిగా కోరుతున్నాను, అది 7% మాత్రమే. కావున 33% మహిళా రిజర్వేషన్ల సమస్యను ముందుగా మీ తండ్రి కేసీఆర్ తో చెప్పాల్సిందిగా కవితను అభ్యర్ధించారు.
Also Read: National Teacher Awards: రాష్ట్రపతి చేతులమీదుగా జాతీయ ఉపాధ్యాయ అవార్డుల ప్రధానం