Gaddar Statue: ట్యాంక్ బండ్ పై గద్దర్ విగ్రహం.. సమాధి వద్ద షర్మిల నివాళి
ప్రజాయుద్ధ నౌకగా పిలుచుకునే ప్రజా గాయకుడు గద్దర్ ఇటీవల తనువు చాలించాడు. తన జీవిత కాలంలో ప్రజా సమస్యలపై అనేక పాటలు పాడి రచించారు.
- Author : Praveen Aluthuru
Date : 14-08-2023 - 12:43 IST
Published By : Hashtagu Telugu Desk
Gaddar Statue: ప్రజాయుద్ధ నౌకగా పిలుచుకునే ప్రజా గాయకుడు గద్దర్ ఇటీవల తనువు చాలించాడు. తన జీవిత కాలంలో ప్రజా సమస్యలపై అనేక పాటలు పాడి రచించారు. వెనుకబడిన కులాల గురించి గద్దర్ పరితపించేవారు. కొన్ని రోజుల క్రితం వరకు ఆయన ప్రజల మధ్య తిరిగారు. పలు రాజకీయ వేదికలపై మెరిశారు. కానీ అనూహ్యంగా ఆయన అనారోగ్యం పాలవడం, ఆస్పత్రిలో గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచారు. తాజాగా గద్దర్ సమాధి వద్ద వైఎస్ఆర్టీపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నివాళులు అర్పించారు. ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా గద్దర్ తో తన కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తుకున్నారు. గద్దర్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ప్రతిష్టంచాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ కేసీఆర్ పై నిప్పులు చెరిగారు.
షర్మిల మాట్లాడుతూ.. గద్దర్ తెలుగు ప్రజల కోసం పుట్టిన మనిషి. ప్రజల గుండెల్లో ఎప్పుడూ బతికే ఉంటారు. ఆయన కృషి, కష్టం, త్యాగానికి గుర్తుగా ట్యాంక్ బండ్ పై గద్దర్ విగ్రహాన్ని పెట్టాలి. గద్దర్ జీవిత చరిత్రను పాఠ్యాంశాలలో ముద్రించాలి. తూప్రాన్ లో స్మారక భవనం నిర్మించాలి. గద్దర్ బ్రతికి ఉన్నప్పుడు అవమానించిన కేసీఆర్.. ఇప్పుడు కపట ప్రేమ ప్రదర్శిస్తున్నాడు. తెలంగాణ కోసం పోరాటం చేసిన గద్దర్ గారికి తొమ్మిదేళ్లుగా కేసీఆర్.. అపాయింట్ మెంట్ ఇవ్వకుండా అవమానించాడు. ప్రశ్నించిన గద్దర్ ను జైల్లో సైతం పెట్టించాడు. గద్దర్ కుటుంబ సభ్యులకు కేసీఅర్ క్షమాపణ చెప్పాలి. వైఎస్సార్ అంటే గద్దర్ గారికి ఎనలేని ప్రేమ. నాతో చాలాసార్లు వైఎస్సార్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు. గద్దర్ గుండెల్లో వైఎస్సార్ ఉన్నారు. మన గుండెల్లో గద్దర్ ఉన్నారని షర్మిల ఉద్వేగానికి గురయ్యారు.