KCR – Health Bulletin : కేసీఆర్‌కు వైద్యచికిత్సలపై యశోదా హాస్పిటల్ హెల్త్ బులెటిన్
KCR - Health Bulletin : మాజీ సీఎం కేసీఆర్‌కు అందిస్తున్న వైద్య చికిత్సలపై యశోదా హాస్పిటల్ హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.
- Author : Pasha
Date : 08-12-2023 - 12:17 IST
Published By : Hashtagu Telugu Desk
KCR – Health Bulletin : మాజీ సీఎం కేసీఆర్‌కు అందిస్తున్న వైద్య చికిత్సలపై యశోదా హాస్పిటల్ హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. దీని ప్రకారం.. కేసీఆర్ తన నివాసంలోని బాత్ రూంలో కాలుజారి కింద పడిపోయారు. ఆ వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం సోమాజీగూడలోని యశోదా హాస్పిటల్‌కు తీసుకొచ్చారు. కేసీఆర్‌కు గాయాలైన భాగాల్లో సీటీ స్కాన్ నిర్వహించారు.
We’re now on WhatsApp. Click to Join.
ఆ సీటీ స్కాన్ నివేదికల్లో.. కేసీఆర్ ఎడమ తుంటికి గాయమైందని వెల్లడైంది. ఎడమ తుంటిని రీప్లేస్ చేయాల్సిన అవసరం ఉందని యశోదా హాస్పిటల్ హెల్త్ బులెటిన్‌లో ప్రస్తావించారు. ఒకవేళ ఆ చికిత్స చేస్తే కేసీఆర్ కోలుకోవడానికి దాదాపు 6వారాల నుంచి 8 వారాల టైం పడుతుందని పేర్కొన్నారు. ఆస్పత్రికి చెందిన ఆర్డో పెడిక్, అనస్తీషియా, జనరల్ మెడిసిన్, పెయిన్ మెడిసిన్ నిపుణులతో కూడిన టీమ్ కేసీఆర్ ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారని హెల్త్ బులెటిన్‌లో(KCR – Health Bulletin) వెల్లడించారు.
Also Read: PM Modi: మోడీజీ వద్దు.. మోడీ అని పిలవండి, పార్టీ సభ్యులకు ప్రధాని రిక్వెస్ట్
సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం మేరకు తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి హుటాహుటిన యశోదా హాస్పిటల్‌కు వెళ్లారు. మాజీ సీఎం కేసీఆర్‌కు వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ల టీమ్‌ను కలిశారు. కేసీఆర్‌కు వైద్యం అందుతున్న తీరుపై ఆరా తీశారు. ఎప్పటికప్పుడు కేసీఆర్ ఆరోగ్య స్థిితి గురించి తమకు అప్‌డేట్ చేయాలని సూచించారు. కేసీఆర్‌కు మెరుగైన వైద్యం అందేలా చూడాలని సీఎం రేవంత్ ఆదేశించారని యశోదా హాస్పిటల్ వైద్యుల టీమ్‌కు చెప్పారు.