Hyderabad: పెద్దమ్మతల్లి టెంపుల్ వద్ద అపస్మారక స్థితిలో మహిళ: కారణం ఆ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే?
హైదరాబాద్ జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి టెంపుల్ పరిసర ప్రాంతంలో గుర్తు తెలియని మహిళ అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు
- Author : Praveen Aluthuru
Date : 30-06-2023 - 12:13 IST
Published By : Hashtagu Telugu Desk
Hyderabad: హైదరాబాద్ జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి టెంపుల్ పరిసర ప్రాంతంలో గుర్తు తెలియని మహిళ అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు జూబ్లీహిల్స్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సదరు మహిళ వివరాలను సేకరించారు. ఆమె ఎవరో కాదు గతంలో అధికార పార్టీ ఎమ్మెల్యేపై లైంగిక ఆరోపణలకు పాల్పడిన మహిళగా పోలీసుల దర్యాప్తులో తేలింది.
బెల్లంపల్లి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే చిన్నయ్యపై గతంలో లైంగిక ఆరోపణలు చేసిన మహిళ పెద్దమ్మతల్లి టెంపుల్ పరిసర ప్రాంతంలో అపస్మారక స్థితిలో ఉంటడం పలు అనుమానాలకు దారి తీసింది. ఈ ఘటనపై పోలీసులు మరోలా అనుమానిస్తున్నారు. ఆత్మహత్యాయత్నంగా అనుమానిస్తున్నామని, అయితే విచారణ తర్వాతే నిజానిజాలు తెలుస్తాయని చెప్పారు. కాగా ప్రస్తుతానికి ఆమెను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
ఎమ్మెల్యే చిన్నయ్యపై గతంలో అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆరిజన్ డెయిరీ వివాదం, రైతులపై అక్రమ కేసులు, వేధింపులు, లైంగిక ఆరోపణలు ఇలా ఈ ప్రజాప్రతినిధిపై లెక్కలేనన్ని ఆరోపణలు ఉన్నప్పటికీ ప్రభుత్వం అతనిపై ఈగ వాలనివ్వడం లేదు. ఇక తాజాగా తనపై లైంగిక ఆరోపణలు చేసిన మహిళ అపస్మారక స్థితిలో పడి ఉండటం గమనార్హం.
Read More: Creative Haircut : బుజ్జి పెట్టెలో బుడ్డోడికి హెయిర్ కట్